Pawan Kalyan and Trivikram Combination Kobali Movie Shooting To Go On Floors Soon | Sardar Gabbar Singh Updates

Pawan kalyan trivikram kobali movie shooting ugadi festival

pawan kalyan, trivikram srinivas, pawan kalyan sardar movie, trivikram srinivas updates, kobali movie news, kobali movie updaets, kobali movie gossips, kobali movie shooting, pawan trivikram kobali

Pawan Kalyan Trivikram Kobali Movie Shooting Ugadi Festival : Accordint To The Tollywood Sources Pawan Kalyan and Trivikram Combination Kobali Movie Shooting To Go On Floors Soon.

మాటల మాంత్రికుడి మాయలో మరోసారి పడ్డ పవన్ కళ్యాణ్

Posted: 09/26/2015 06:38 PM IST
Pawan kalyan trivikram kobali movie shooting ugadi festival

తెలుగు చిత్రపరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి పవన్ కళ్యాణ్ ని తన మాయలో పడేశాడు. నిన్నటిదాకా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన ప్రచారాలకు తన తాజా నిర్ణయంతో ఫుల్ స్టాప్ పెట్టించాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మునుపటిలా మాటలతో కాలక్షేపం చేయకుండా.. ఈసారి పక్కా ప్లాన్ తో వున్నాడని తెలుస్తోంది. పైగా.. ఇతను ఏర్పరుచుకున్న ప్లాన్ కు పవన్ కూడా ఫిదా అవడంతో త్రివిక్రమ్ త్వరలోనే రంగంలోకి దిగనున్నాడు.

గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘కోబలి’ చిత్రం రానుందని వార్తలు తెరమీదకి వచ్చాయి. చాలాకాలం నుంచి షికార్లు కొడుతున్న ఈ వార్త.. ఆమధ్య సెట్స్ కి వెళ్లనుందని టాక్ వినిపించింది. కానీ.. అలా జరగకపోవడంతో అసలీ సినిమా వుండదని భావించారు. పైగా.. పవన్ తన ప్రాజెక్టులతో పాటు రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అయిపోవడం, మరోవైపు త్రివిక్రమ్ తన పనుల్లో నిమగ్నమైపోవడంతో దాదాపు ‘కోబలి’ లేనట్టేనని అనుకున్నారు. దీంతో ‘కోబలి’కి సంబంధించిన వార్తలు మళ్లీ వినిపించలేదు. కానీ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఈసారి పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘కోబలి’ సినిమా తెరకెక్కడం ఖాయమని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం చిత్రవర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తేమిటంటే.. ఇటీవల త్రివిక్రమ్ ‘కోబలి’ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టును పవన్ కి వినిపించాడట. ఆ స్ర్కిప్ట్ విని సంతృప్తి చెందిన పవన్.. సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న ‘అ.. ఆ..’ సినిమా చిత్రీకరణ పూర్తికాగానే.. ఉగాదికి ‘కోబలి’ని సెట్స్ పైకి తీసుకువెళ్లవచ్చునని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ చిత్రం నిజంగానే సెట్స్ పైకి వెళ్లనుందా? లేదా? అనే విషయం తెలియాలంటే.. ఎవరో ఒకరు పెదవి విప్పాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  trivikram srinivas  kobali movie updates  

Other Articles