Pawanism | celebrations in US | arrangements in USA

Pawanism celebration arrangements in usa

pawanism celebrations in US, pawanism in USA, pawanism in American cities, pawanism in Silicon Valley (San Jose), pawanism in Los Angeles, pawanism in Dallas, pawanism in Detroit, pawanism in New Jersey, pawanism in Chicago, power star pawan kalyan, pawan kalyan, chiranjeevi, ram charan teja, allu arjun, tollywood

6 cities across USA Silicon Valley (San Jose), Los Angeles, Dallas, Detroit, New Jersey and Chicago are celebrating Pawanism with an event on 11th OCT 2015.

అగ్రరాజ్యంలో హోరెత్తనున్న పవనిజం.. ముమ్మర ఏర్పాట్లు..

Posted: 09/25/2015 09:48 PM IST
Pawanism celebration arrangements in usa

పవనిజం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటింది. భారత దేశ పరిధి దాటి సప్తసముద్రాల అవతల వున్న అగ్రరాజ్యంలో కూడా మారుమ్రోగనుంది. అమెరికాలోని ఆరు నగరాలైన సిలికాన్ వ్యాలీ, లాస్ ఏంజిల్స్, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, చికాగోల్లో అక్టోబర్ 11న ‘పవనిజం' సెలబ్రేషన్స్ జరిపేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అగ్రరాజ్యంలో సమావేశమైన పవన్ కల్యాణ్ అభిమానులు మునుపెన్నడూ లేనంత అట్టహాసంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు.

జనసేన అధినేత, తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము ఎందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్న విషయాలను కూడా సవివరంగా వివరించేందుకు అభిమానులు, వాటెంటీర్లు సిద్దమయ్యారు. అక్టోబర్ 11ను 'వరల్డ్ పవనిజం డే' గా జరుపుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు 2013లోనే నిర్ణయించారు. పవర్ స్టార్ చిత్రరంగంలోకి అడుగుపెట్టి.. ఆయన నటించిన తొలి సినిమా ఇక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి చిత్రం ఇదే రోజున విడుదలైన సందర్భంగా ఈ తేదీనే పవనిజం డే గా పాటిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.

ఇండియాతో పాటు అమెరికా తదితర దేశాల్లో ఉన్న అభిమానులు వరల్డ్ పవనిజం డేను సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆదర్శంగా 'పవనిజం' కాన్సెప్టుతో సమాజానికి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఉద్దేశ్యంతో అభిమానుంలంతా ముందుకు సాగుతున్నారు. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్... పవనిజం గురించి మాట్లాడుతూ.....'పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి నేను ఆశిస్తున్నానని' అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chiranjeevi  ram charan teja  allu arjun  tollywood  

Other Articles