Balakrishna Dictator Movie Completes First Schedule

Balakrishna dictator movie completes first schedule

Balakrishna Dictator Movie First Schedule Completed, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Balakrishna Dictator Movie Completes First Schedule: Eros International Media Limited (Eros International), is happy to announce the successful completion of the first schedule of its Telugu production with Natasimha Balakrishna’s Dictator in Hyderabad. Produced by Eros International in association with Vedaashwa Creations, the film is directed by Sriwass

బాలయ్య డిక్టేటర్ తొలి షెడ్యూల్ పూర్తి

Posted: 08/25/2015 10:02 AM IST
Balakrishna dictator movie completes first schedule

సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా పేరు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రచయితలు కోనవెంటక్, గోపిమోహన్ లు ఈ చిత్రానికి రచయితలుగా వర్క్ చేస్తున్నారు. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రూపొందుతోన్న మరో చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈరోస్ ఇంటర్నేషనల్ సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.

ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ ‘’ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎగ్జయిట్ ఫేజ్ లో ఉంది. ఇక్కడ గొప్ప కథలు, రచయితలు, నటీనటులున్నారు. ఇలాంటి ఇండస్ట్రీలో మేం కూడా పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ‘శ్రీమంతుడు’ సక్సెస్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, శ్రీవాస్ ల కాంబినేష్ లో రూపొందుతోన్న ‘డిక్టేటర్’ లో పార్ట్ కావడం చాలా హ్యపీగా ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ ను మరిన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ ‘’పెద్ద డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ కావడం చాలా హ్యపీగా ఉంది. దీనివల్ల సినిమా రీచింగ్ స్ట్రెంగ్త్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సంస్థలో ‘డిక్టేటర్’ మూవీ చేస్తున్నాం. సక్సెస్ ఫుల్ గా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాం. సినిమా నిర్మాణంలో అన్నీ వసతులను కల్పించి సినిమా బాగా రావడానికి ఈరోస్ సంస్థ దోహదపడుతుంది. నెక్స్ ట్ ఫారిన్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాం. ఈ షెడ్యూల్ ను యూరప్ లో చిత్రీకరిస్తున్నాం. అందులో భాగంగా కొంత టాకీ పార్ట్, యాక్షన్, సాంగ్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈరోస్ సంస్థ జర్నీలో డిక్టేటర్ హ్యుజ్ సక్సెస్ అయి పెద్ద మైల్ స్టోన్ మూవీ అవుతుంది. మంచి కథ, గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతోన్న ‘డిక్టేటర్’ అభిమానులకు, అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది అన్నారు.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘డిక్టేటర్’ లో అన్నీ రకాల ఎమోషన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ తో బాలకృష్ణ అభిమానులను అలరించేలా ఉంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడుతారు. ఈ సినిమాని హైదరాబాద్, ఢిల్లీ సహా యూరప్ లో చిత్రీకరిస్తునారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న 99వ చిత్రం డిక్టేటర్. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్ చౌహాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Release Date  First Schedule Completed  Anjali  sonal chauhan  stills  

Other Articles