Cheekati Rajyam Movie Latest Updates

Cheekati rajyam movie latest updates

Kamal Haasan Cheekati Rajyam Movie Shooting finish, Kamal Haasan Cheekati Rajyam Movie Latest Updates, Kamal Haasan Cheekati Rajyam Movie news, Kamal Haasan Cheekati Rajyam Movie updates, Kamal Haasan Cheekati Rajyam Movie details, Kamal Haasan Cheekati Rajyam Movie posters, Kamal Haasan Cheekati Rajyam Movie stills, Kamal Haasan, Cheekati Rajyam

Cheekati Rajyam Movie Latest Updates: Tamil star hero Kamal Haasan upcoming film Cheekati Rajyam. Trisha heroine. madhushalini acts in key role. Rajesh Director.

ఈ సినిమా చాలా డిఫరెంట్ అంటున్న కమల్

Posted: 08/14/2015 09:59 AM IST
Cheekati rajyam movie latest updates

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తూంగవనం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో విడుదల చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మిస్తున్నారు.

ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. హైదరాబాద్, చెన్నైలోని పలు అందమైన ప్రదేశాల్లో కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సంధర్భంగా కమల్ మాట్లాడుతూ... ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. వెరీ డిఫరెంట్ జోనర్ ఫిల్మ్. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ వుంటుంది. గిబ్రాన్ మంచి సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.

గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇందులో నటి మధుశాలిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Cheekati Rajyam  Trisha  Posters  

Other Articles