Sudheer Babu Next Film Title Bhale Manchi Roju

Sudheer babu next film title bhale manchi roju

Sudheer Babu Next Film Title Confirmed, Sudheer Babu Next Film Title Bhale Manchi Roju, Sudheer Babu bhale manchi roju, Sudheer Babu movie news, Sudheer Babu movie updates, Sudheer Babu latest news, Sudheer Babu film updates, Sudheer Babu new movie details, Sudheer Babu stills, Sudheer Babu

Sudheer Babu Next Film Title Bhale Manchi Roju: Actor Sudheer Babu Next Film Title Confirmed. Title is Bhale Manchi Roju. Sriram Aditya Director. Shashi, Vamshi Producers.

సుధీర్ చిత్రానికి భలే మంచి రోజు

Posted: 07/31/2015 09:42 AM IST
Sudheer babu next film title bhale manchi roju

వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇవి విడుదలై ఆరు నెలల కాకముందే తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శశి, వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘భలే మంచి రోజు’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. కథకు తగ్గట్టుగానే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది.

ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు. కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం2’, ‘ఉత్తమ విలన్’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫిని అందించిన శాందత్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Bhale Manchi Roju  Movie News  stills  

Other Articles