OK Kanmani Movie Remake into bollywood

Ok kanmani movie remake into bollywood

OK Bangaram Movie Hindi Remake News, OK Kanmani Remake, OK Kanmani hindi remake, OK Kanmani remake details, Sonakshi sinha in OK Kanmani remake, Sonakshi sinha latest news, Sonakshi sinha movie news, Sonakshi sinha movie updates, Sonakshi sinha

OK Kanmani Movie Remake into bollywood: Tamil star director Maniratnam latest romantic love entertainer OK Kanmani. OK Kanmani remake into bollywood. Aditya ray kapoor and Sonakshi sinha acts in lead roles.

ఓకే బంగారం రీమేక్ లో ఆదిత్య, సోనాక్షి

Posted: 07/28/2015 05:05 PM IST
Ok kanmani movie remake into bollywood

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తాజా ప్రేమకథా చిత్రం ‘ఓకే కణ్మని’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో విడుదల చేసారు. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు.

యువతీయువకుల సహజీవనం కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘ఓకే బంగారం’ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో మొదట వరుణ్ ధావన్, ఆలీయా భట్ లను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేసారు. కానీ వీరి డేట్లు కుదరకపోవడంతో ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హాలను ఎంపిక చేసారు. ఈ రీమేక్ చిత్రానికి షాద్ అలీ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ రీమేక్ సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi sinha  Ok kanmani  OK Bangaram  Hindi Remake  Movie news  

Other Articles