తండ్రి బాటలో నడవాలంటే చాలా కష్టం. కానీ తన తండ్రి పేరుకు ఏ మాత్రం కలంకం రానివ్వకుండా, తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ, తన వ్యక్తిత్వంతో తండ్రిగారి పేరును నిలబెడుతున్న ఒక కొడుకు అతను. ఎంతో మంది అభిమానులకు ఆయనొక నటసింహం. వెండితెర మీద ఆయన సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాసాయి.. తిరగరాస్తున్నాయి... తిరగరాస్తాయి. వయసు పెరుగుతున్నకొద్ది ప్రతీ ఒక్కరిలో అలుపొస్తుంది.. కానీ ఈయనలో మాత్రం ఊపొస్తుంది. ఇప్పటికీ కూడా అదే జోష్, అదే పవర్. ఆ గుండె వెనకున్న దమ్ముకు, ఎనర్జీకి అభిమానులు ఆ వ్యక్తికి నీరాజనాలు పడుతున్నారు. ఆ నటసింహం మరెవరో కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు, లెజెండ్ నందమూరి బాలకృష్ణ. నేడు బాలయ్య పుట్టినరోజు.
కొందరు కొడితే ఎక్స్ రే లో కనిపిస్తుంది.. మరికొందరూ కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది... కానీ బాలయ్య సింహ గర్జన చేస్తే రికార్డులు బద్దలుకొట్టి, హిస్టరీలో వినబడతాయి. ఇప్పటివరకు ఏ హీరో రికార్డు తీసుకున్న కూడా కొంత వయసు పరిమితి వరకు మాత్రమే అభిమానులను అలరించారు. కానీ నందమూరి బాలయ్య మాత్రం ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఐదుపదుల వయసు దాటినప్పటికీ కూడా యూత్ కు ఉండే ఎనర్జీ ఆయనలో ఉంటుంది. నేటి యువ హీరోలకు పోటీగా ఆయన స్టెప్పులెస్తూ గట్టి పోటీనిస్తున్నాడు బాలయ్య.
కేవలం కమర్షియల్ సినిమాల్లో మాత్రమే కాకుండా పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో కూడా నటించి బాలయ్య నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈయన నటనకు చాలా అవార్డులు, రివార్డులు వచ్చాయి. చాలా సినిమాలకు ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నాడు బాలయ్య. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన భక్తిరస చిత్రం ‘‘శ్రీరామరాజ్యం’’ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటించిన బాలయ్యకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది.
ఇక రాజకీయపరంగా కూడా బాలయ్య సరికొత్త చరిత్రనే సృష్టించారు. తండ్రి బాటలోనే తాను నడుస్తూ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఈ విజయంపై బాలకృష్ణ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ... అక్కడ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా వుంటానని, ఆ ప్రాంత ఎదుగుదలకు కృషిచేస్తానని, ప్రజల ఉన్నతికి ఎల్పప్పుడూ పాటుపడతానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే అటు ప్రజలతో మమేకమవుతూ వారికి సేవా చేసుకుంటున్నారు.
కేవలం చిత్రపరిశ్రమలోనే కాకుండా, రాజకీయాల్లో కూడా బాలయ్య తన సత్తాను చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి నందమూరి అందగాడు ఇలాగే అభిమానులను తన సినిమాలతో అలరిస్తూ, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ... నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువిశేష్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more