Charmme Mantra 2 Audio Release Date Confirmed | mantra-2

Charmme mantra 2 audio release date confirmed

Mantra2 Audio Release Date Confirmed, Mantra2 Audio Release Date, Mantra 2 movie news, Mantra 2 latest news, Mantra 2 stills, Mantra 2 hot news, Mantra 2 hot stills, Mantra 2 movie posters, Mantra 2 songs, Mantra 2, Charmme hot stills, Charmme hot news, Charmme stills, Charmme latest news, Charmme movie news, Charmme movie updates, Charmme

Charmme Mantra 2 Audio Release Date Confirmed: Charmme latest horror movie mantra 2. this movie audio release on 8 may.

రేపే ఛార్మి మంత్ర2 ఆడియో విడుదల

Posted: 05/07/2015 12:32 PM IST
Charmme mantra 2 audio release date confirmed

టాలీవుడ్ ఛార్మింగ్ గర్ల్ ఛార్మీకి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రం ‘మంత్ర’. ఇందులోని ‘మహా మహా...’ పాట ద్వారా భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. హర్రర్, థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ‘మంత్ర’ మంచి విజయం సాధించింది. ‘మంత్ర’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న తాజా చిత్రం ‘మంత్ర2’. కె. పద్మ సమర్పణలో బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఛార్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శివశంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను రేపు ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పూరీ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో ఛార్మీ ‘జ్యోతిలక్ష్మీ’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పూరీ, ఛార్మీలకు మంచి స్నేహం కూడా వున్నందువల్ల ‘మంత్ర2’ ఆడియో కార్యక్రమానికి పూరీ రాబోతున్నట్లుగా తెలిసింది.

‘మంత్ర’ కంటే భారీ హర్రర్, థ్రిల్లర్ గా ‘మంత్ర2’ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘మంత్ర’లో బాగా పాపులర్ అయిన ‘మహా మహా...’ పాట కంటే ‘మంత్ర2’లోని ఓ పాట భారీ హాట్ హాట్ గా తెరకెక్కించారని సమాచారం. ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme  Mantra 2  Audio release date  

Other Articles