Balakrishna | Legend Movie | Creates New Record | 400 days

Balakrishna legend movie creating new records

Balakrishna Legend Movie Creates New Records, Balakrishna Legend Movie 400days, Legend Movie latest news, Legend Movie posters, Legend Movie songs, Legend Movie audio, Legend Movie trailers, Legend Movie, Balakrishna latest news, Balakrishna movie news, Balakrishna movie updates, Balakrishna stills, Balakrishna

Balakrishna Legend Movie Creating New Records: Nandamuri Balakrishna Block buster movie legend. This movie completes 365 days successfully. Director Boyapati srinu.

వారెవ్వా... కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్న లెజెండ్

Posted: 04/29/2015 04:19 PM IST
Balakrishna legend movie creating new records

‘చరిత్ర సృష్టించాలన్న మేమే.. దానిని తిరగరాయాలన్న మేమే’ అంటూ నందమూరి బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ అక్షరసత్యంగా మారింది. ఇప్పటి వరకు ఏ నటుడికి దక్కని ఘనత బాలయ్యకు దక్కింది. బాలయ్య నటించిన ‘లెజెండ్’ చిత్రానికి దక్కింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ చిత్రం విడుదలైన ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు మరియు రీరికార్డింగ్... ఈ సినిమాకు ప్రాణం పోసాయి. ఇక సోనల్ చౌహన్ అందచందాలు, రాధికా ఆప్టే అభినయం ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. తొలిసారిగా హీరో పాత్రలో నుంచి విలన్ పాత్రలోకి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు... బాలయ్యకు గట్టిపోటీనిచ్చాడు. ‘లెజెండ్’ ను ఎదుర్కొనే విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు.

ఇన్ని ప్లస్ పాయింట్స్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేసి, కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం విడుదలై మే 1వ తేదికి 400 రోజులు పూర్తి చేసుకోనుంది. ఒకే థియేటర్లో 400 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా బాలయ్య ‘లెజెండ్’ నిలువనుంది. ప్రస్తుతం ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరులో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

ఈ చిత్రం 400రోజులు పూర్తి చేసుకుంటున్న సంధర్భంగా మే 2వ తేదిన ఎమ్మిగనూరులో ఓ భారీ వేడుక ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక అతిథిగా విచ్చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలుగు దేశం పార్టీ రాజకీయనాయకులు కూడా ఇందులో పాల్గొననున్నారని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.


Video Source: SriBalajiMovies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Legend Movie  Creates New Record  400 days  

Other Articles