Rana Daggubati | marriage | stills | Bangalore Days remake

Rana marriage in bangalore days remake movie

Rana marriage, Rana marriage in Bangalore Days Tamil Remake Movie, Bangalore Days Tamil Remake, Bangalore Days Tamil Remake news, Bangalore Days Tamil Remake stills, Bangalore Days Tamil Remake launch stills, Bangalore Days Tamil Remake updates

Rana marriage in Bangalore Days Remake Movie: Malayalam hit movie Bangalore Days remake in to telugu and tamil. Rana, Arya, Rana Daggubati, Bobby Simha, Sridivya playing lead roles in tamil version. Pvp Produce.

తమిళ సాంప్రదాయ పద్ధతిలో రానా పెళ్లి

Posted: 04/28/2015 10:38 AM IST
Rana marriage in bangalore days remake movie

అసలే టాలీవుడ్ లో వున్న మోస్ట్ బ్యాచిలర్ హీరోలలో రానా కూడా ఒకరు. అలాంటి రానా సినిమాలో పెళ్లి కాకుండా నిజజీవితంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ రానా మళ్లీ పెళ్లికొడుకు అవతారంలో కనిపించి అందరికి షాకిచ్చాడు. కానీ ఇది నిజమైన పెళ్లి కాదు.. కేవలం సినిమా పెళ్లి మాత్రమే.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ రీమేక్ షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభమయ్యింది. ప్రముఖ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ఈ తమిళ రీమేక్ ను నిర్మిస్తున్నారు.

ఈ తమిళ రీమేక్ కు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీదివ్య, లక్ష్మీ రాయ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే రానా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే తాజాగా రానాకు పెళ్లి చేస్తున్నారు. ఈ సన్నీవేశానికి సంబంధించిన ఓ స్టిల్ ను విడుదల చేసారు. ఇందులో రానా చాలా చక్కగా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘బెంగళూర్ డేస్’ చిత్రానికి సంగీతం అందించిన గోపిసుందర్... ఈ తమిళ రీమేక్ కు కూడా సంగీతం అందిస్తున్నాడు. తెలుగు వర్షెన్ కు ‘ఓమైఫ్రెండ్’ చిత్ర ఫేం వేణుశ్రీరాం దర్శకత్వం వహించనున్నాడు. తెలుగులో శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్‌, శ్రీదివ్యలను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Rana marriage in Bangalore Days Tamil Remake Movie-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  marriage  stills  Bangalore Days remake  

Other Articles