ప్రస్తుతం వస్తున్న ప్రతి సినిమాలోనూ ఐటెంసాంగులు ప్రధాన ఆకర్షణగా నిలిచిపోయాయి. ఈ పాటలేనిదే సినిమాయే లేదన్న భావన ప్రేక్షకుల్లో, సినీవర్గాల్లో వుండిపోయింది. దీంతో దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా ఈ పాటలను తమ సినిమాల్లో అరేంజ్ చేసుకుంటున్నారు. కాలక్రమంలో వీటిని మరింత ప్రజాదరణ పొందిన నేపథ్యంలో కథానాయికలు సైతం ఈ పాటల్లో నృత్యించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటువంటి సాంగుల్లో హీరోలతో స్టెప్పులేస్తే తమ పాపులారిటీ మరింత పెరుగుతుందన్న ఉద్దేశంతో స్టార్ హీరోయిన్లు సైతం ముందుకు వస్తున్నారు. ఇక అరకొర సినిమాలు చేసుకుంటున్న తారలైతే ఐటెంసాంగుల్లో నటించేందుకు పోటీపడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి నిఖిత కూడా చేరిపోయింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర దక్షిణాది భాషాచిత్రాల్లో ఎన్నో సినిమాల్లో నటించింది నటి నిఖిత! ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి పేరు పొందిన ఈ అమ్మడు.. తర్వాత కొత్త తారల హవా నేపథ్యంలో ఈమె ఇమేజ్ పడిపోయింది. దీంతో కన్నడ, తమిళం, మలయాళంలో సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతోంది. అయితే.. అక్కడ కూడా ఈమెకు భారీ సినిమాల్లో నటించే అదృష్టం లేకపోవడంతో అరకొర సినిమాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈమెకు ఐటెంసాంగులో నటించేందుకు ఆఫర్ రాగా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పేసుకుంది. అది కూడా హీరో విశాల్ సినిమాలో ఈ ఐటెం ఆఫర్ రావడంతో అమ్మడు ఎగిరి గంతులేసిందట! కనీసం ఈ పాటతోనైనా తమిళంలో తనకు కాస్త గుర్తింపు పెరుగుతుందన్న ఆకాంక్షతోనే ఈ పాటలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.
విశాల్ హీరోగా నటిస్తున్న ‘పాయుం పులి’ అనే సినిమాలోనే నిఖిత ఐటెం సాంగులో నటిస్తోంది. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ ముగిసింది. భారీగా వేసిన మార్కెట్ సెట్ లో ఈ పాటను చిత్రీకరించారని.. ఈ సాంగ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చిత్రం యూనిట్ తెలుపుతోంది. మరి.. ఈ పాట నిఖిత కెరీర్ కి ఏమాత్రం హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more