Ram charan meet bala bhairava child parashuram

ram charan, ram charan tej news, ram charan tej bala bhairava, bala bhairava youtube, magadheera dialogues, ram charan latest updates, ram charan photos, ram charan gallery, ram charan bala bhairava photos, parashuram ram chara

ram charan meet bala bhairava child parashuram : Finally mega power star ram charan tej meets the boy who is famous as bala bhairava on youtube. In this movement cherry given promise to him that he will make him hero in future.

‘బాల భైరవుడి’కి మాటిచ్చిన రామ్ చరణ్

Posted: 03/16/2015 12:18 PM IST
Ram charan meet bala bhairava child parashuram

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాలోని కొన్ని డైలాగులను ఇమిటేట్ చేస్తూ ఓ బాలుడు చెప్పిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం విదితమే! ఆ వీడియోను వీక్షించిన చెర్రీ.. ఆ అబ్బాయిని కలవాలని తన కోరిక వెల్లడించాడు. అంతే! వెంటనే మెగాఫ్యాన్స్ రంగంలోకి ఆ బాలుడి ఆచూకీ కొనుగొన్నారు. చెర్రీ ఎట్టకేలకు ఆ బాలుడిని కలుసుకున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో అయిజకు చెందిన గొర్రెల కాపరి దంపతుల కుమారుడైన ఈ ఎనిమిదేళ్ల పరశురామ్ ని చెర్రీ కలిశాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు చెర్రీ ముందు మరోసారి ఆ మగధీర డైలాగులను వల్లెవేసి, మెగాహీరోను ఆకట్టుకున్నాడు. ఆ బాలుడు చెప్పిన డైలాగ్స్ విన్న అనంతరం చెర్రీ అతనిని అభినందింది.. ‘డైలాగులు చెప్పడం కాదు.. నేను నిన్ను చదివిస్తాను.. బాగా చదువుకుంటావా..?’ అని అడిగాడు. అలాగే.. బాగా చదువుకుంటే పెద్దయ్యాక నీతో మరోసారి కలుస్తాన’ని చరణ్ అతడిని మాటిచ్చాడు. అంతేకాదు.. అతనికి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాడు.

అయితే.. పరశురాం మాత్రం గుక్కనిలబెట్టకుండా డైలాగులు చెబుతుండడంతో.. ‘బాగుంది… పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించాడు. దానికి ఆ బాలుడు ‘హీరో అవ్వాలనుకుంటున్నా’ అని టక్కున సమాధానమిచ్చాడు. ఆ బాలుడి సమాధానానికి చిరునవ్వు నవ్విన చరణ్.. ‘సరే ముందు నువ్వు బాగా చదువుకో.. హీరోని చేస్తా’ అని మాటిచ్చాడు. అనంతరం ‘ఆరేంజ్’ సినిమాలో తాను ధరించిన టీ షర్టును బహుమతిగా ఆ అబ్బాయికి ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ram charan tej  youtube parashuram  youtube bala bhairava  

Other Articles