Kareena kapoor karishma kapoor movie script latest updates

kareena kapoo, karishma kapoor, kareena kapoor hot photos, kareena interview, kareena press meet, karishma kapoor news, karishma photos, karishma hot photos, karishma gallery, karishma hot photo shoot, karishma kareena movie

kareena kapoor karishma kapoor movie script latest updates : Kapoor sisters kareena and karishma bother waiting for a good script to do movie.

అనుభూతి చెందేవరకు కపూర్ సిస్టర్స్ ఒప్పుకోరట!

Posted: 03/07/2015 11:39 AM IST
Kareena kapoor karishma kapoor movie script latest updates

బాలీవుడ్ కపూర్ సిస్టర్స్ అయిన కరీనా(బెబో), కరీష్మా ఇద్దరూ హీరోయిన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే! 90 దశకంలో కరిష్మా తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేయగా.. కరీనా తన అందంతో ఇప్పటికీ యూత్ ని కట్టిపడేస్తోంది. అయితే.. వీరిద్దరూ కలిసి ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇదే విషయమై బెబోని ప్రశ్నించగా.. ‘సరైన స్ర్కిప్టు దొరికేవరకూ ఆగాల్సిందే’నని పేర్కొంటోంది.

ఈ నేపథ్యంలోనే కరీనా మాట్లాడుతూ.. ‘చాలామంది దర్శకులు మా ఇద్దరికోసం చాలా పాత్రలు ఆఫర్ చేశారు. అయితే.. అవి మాకు అంతగా నచ్చలేదు. దర్శకులు తెచ్చేపాత్రలు మమ్మల్ని కన్విన్స్ చేయగలిగితేనే ఒప్పుకుంటాం. మాకు మంచి స్ర్కిప్టు అవసరం. కథ విని ముందుగా మేము అనుభూతి చెందాలి. అప్పుడే పాత్రలో లీనమై నటించడానికి వీలుగా వుంటుంది. అలాంటి రైట్ స్ర్కిప్టు కోసమే వెయిట్ చేస్తున్నాం’’ అని తెలిపింది.

ఇదిలావుండగా.. 2003లో సంజయ్ తో కరిష్మా కపూర్ పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమయ్యింది. అయితే.. 2008లో ‘నచ్ బలియే’ డ్యాన్స్ షోకు జడ్జిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అలాగే ‘బాడీగార్డ్’ సినిమాలో నటించిన తన చెల్లెలు కరీనాకు ఆమె డబ్బింగ్ చెప్పింది. అలాగే ఓ డాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది. అనంతరం ‘డేంజరస్ ఇష్క్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ.. ఆ మూవీ బెడిసి కొట్టింది. ఇక 2014లో భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం.. ఏ మూవీలోనూ నటించక, కేవలం యాడ్ లు చేసుకుంటూ జీవితం కొనసాగిస్తోంది.

ఇక కరీనా, సైఫ్ ని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పటికీ సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సల్మాన్ ఖాన్ సరసన ‘బాజీరావ్ భైజాన్’ మూవీలో నటిస్తోంది. అలాగే తన స్నేహితుడు కరణ్ జోహర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘బ్రదర్స్’ అనే మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kareena kapoor  karishma kapoor  bollywood news  

Other Articles