Son of sathyamurthy movie pre first look poster

Son of Sathyamurthy Movie Pre First Look Poster, Son of Satyamurthy Audio Launch on March 15, Pawan Kalyan to Son of Satyamurthy Audio Launch, Maa Tv Bags Son of Sathyamurthy Satellite Rights, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates, director satyadeva, trisha krishnan news, radhika apte news

Son of Sathyamurthy Movie Pre First Look Poster: Allu Arjun latest movie Son of Sathyamurthy. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి ప్రీ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 03/06/2015 02:56 PM IST
Son of sathyamurthy movie pre first look poster

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని మూడు సాంగ్స్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లిన చిత్ర యూనిట్ నేడు తిరిగి వస్తున్నారు.

ఈరోజు హోళీ సంధర్భంగా ఈ చిత్ర ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో వున్న 16 మంది నటీనటులను సరిగ్గా గుర్తుపట్టిన వారికి ఈ చిత్ర ఆడియో పాసెస్ బహుమతిగా అందజేయనున్నట్లుగా ప్రకటించారు.

తాజాగా విడుదల చేసిన ఆ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ మీకోసం అందిస్తున్నాం. మీరు కూడా ఆ నటీనటులను గుర్తుపట్టి, సరైన సమాధానాలు చెప్పి, ఆడియో పాసెస్ పొందండి. ఈరోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. అలాగే ఈరోజు నుంచి వచ్చే 10రోజుల వరకు ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా చేయనున్నట్లుగా తెలిసింది.

ఈ సినిమాలో బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈనెల 15న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరుపనున్నారు.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Sathyamurthy  Pre First Look Poster  Allu Arjun  

Other Articles