Rudhramadevi movie theatrical trailer released

Rudhramadevi theatrical trailer Released, Rudhramadevi theatrical trailer, Rudhramadevi theatrical teaser, Rudhramadevi First look trailer, Rudhramadevi theatrical trailer Response, Rudhramadevi trailer latest news, Rudhramadevi latest news, Rudhramadevi movie news, Rudhramadevi news, Rudhramadevi teaser

Rudhramadevi movie theatrical trailer Released: Anushka, Rana, Allu arjun act in lead roles. Director Gunashekhar upcoming movie Rudramadevi. Rudramadevi first look teaser released.

రుద్రమదేవి ట్రైలర్ విడుదల... రికార్డులు తిరగరాయడం ఖాయం

Posted: 03/02/2015 06:43 PM IST
Rudhramadevi movie theatrical trailer released

తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రుద్రమదేవి’ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ తాజాగా ఈరోజు సాయంత్రం విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ను మొన్న ఫిబ్రవరి 28న ప్రీమియర్ షో ద్వారా ప్రసాద్ ఐ మాక్స్ లో ప్రదర్శించారు.

ఈ ట్రైలర్ ను చూసిన ప్రతిఒక్కరి నుంచి మంచి స్పందన లభించింది. సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన అదే ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో అనుష్క, రానా, అల్లు అర్జున్ లను చూస్తుంటే... సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు.

‘రుద్రమదేవి’ చిత్ర ఈ ఫస్ట్ లుక్ ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారగణం ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నెల చివర్లో ‘రుద్రమదేవి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  theatrical trailer  Gunashekhar  Anushka  

Other Articles