Rajamouli bahubali movie adavi sesh prince character role tollywood

rajamouli news, adavi sesh news, bahubali movie news, prabhas news, tollywood gossips, tollywood news, anushka shetty news, tamanna bhatia news, rana daggubati news, rajamouli twitter, adavi sesh movies

rajamouli bahubali movie adavi sesh prince character role tollywood : Telugu actor adavi sesh says thanks to rajamouli for giving offer to him as prince character in bahubali epic movie.

ఆలస్యంగా ఆఫర్ ఇచ్చిన జక్కన్న?

Posted: 02/05/2015 03:41 PM IST
Rajamouli bahubali movie adavi sesh prince character role tollywood

దర్శకధీరుడు రాజమౌళి ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటాడు. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు అది పర్ ఫెక్ట్’గా పూర్తయ్యేవరకు ముగించరు. అందుకే.. ఈయన తెరకెక్కించే చిత్రాలు కాస్త ఆలస్యమవుతాయి. అలాగే ఆయన రూపొందించే చిత్రాల్లో ఏ లోటు లేకుండా చూసుకుంటాడో.. పాత్రలకు తగ్గట్టు నటీనటులను ఎంచుకోవడంలో అన్నే జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక పాత్రకు తగిన వ్యక్తి సరిపోతాడని రాజమౌళి ఫిక్స్ అయితే.. అతని వెంటపడి మరీ తన మూవీలో రోల్ ఇప్పిస్తాడు రాజమౌళి! ఇటువంటి ఘటనే దర్శకుడు-ప్రొడ్యూసర్-హీరో అయిన అడవిశేష్’కి ఎదురైంది.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో అడవిశేష్ ఒక కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే.. ఈ పాత్ర అతనికి అంత సామాన్యంగా లభించలేదు. ఆయన చిత్రంలో ఓ చిన్న రోల్ అయినా చేయాలనే కోరికతో వున్న అడవిశేష్.. ఆ ప్రయత్నం దిశగానే పావులు కదిపాడు. ఈ విషయమై ఈ హీరో మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’లాంటి ఎపిక్ చిత్రంలో చిన్న పాత్రయినా చేయాలనుకున్నాను. అందుకే, రాజమౌళి గారిని పరిచయం చేయమని నిర్మాత శోభుగారిని అడిగాను. అలా ఆయన ద్వారా సార్’ణి కలిసి, ‘మీ సినిమాలో చిన్న పాత్రయినా ఇవ్వండి సార్’ అని రిక్వెస్ట్ చేశాను. కానీ.. అప్పుడాయని ఏమీ మాట్లాడలేదు’’.

‘‘ఇలా చాలారోజులు గడిచిపోయింది. నన్ను ఆయన మరిచిపోయి వుంటారనుకున్నాను. కానీ.. కొన్ని నెలల తర్వాత స్వయంగా రాజమౌళియే ఫోన్ చేసి, ‘ఒక ఇంపార్టెంట్ ప్రిన్స్ క్యారెక్టర్ వుంది చేస్తావా?’ అని అడిగారు. అప్పుడు నేను సంతోషంగా ఎగిరిగంతేశాను. ఆయన ఇచ్చిన ఆఫర్’కు నేను థ్యాంక్స్ చెప్పాను. అలా ఆ విధంగా నేను కూడా ‘బాహుబలి’ పరివారంలో చేరిపోయాను’’ అని వివరించాడు అడవి శేష్! ఇక్కడ.. కొన్ని నెలలు గడిచిన కూడా జక్కన్న అడవి శేష్’ని గుర్తు పెట్టుకుని మరీ ఆఫర్ ఇచ్చాడటే.. ఆయన దర్శకత్వం ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి రాజమౌళి ఆ రాజు పాత్రను మరొకరికి ఇచ్చి వుండొచ్చు. కానీ.. నెలల తరబడి నిరీక్షణ చేసిన తర్వాత సదరు పాత్రకు అడవి శేష్ అయితేనే బాగుంటుందని గ్రహించి, అతడికి ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చాడు. ఎంత ఆలస్యమైనా.. చివరికి తనకు ఒక చిన్న రోల్ ఆఫర్ ఇచ్చినందుకు అడవి శేష్ సంతృప్తి వ్యక్తం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ss rajamouli latest news  adavi sesh bahubali movie  tollywood news  

Other Articles