Hansika mumbai big property place orphaned children

hansika motwani news, hansika motwani orphan children, hansika motwani mumbai property, hansika motwani remuneration, hansika motwani hot photos, hansika motwani latest news, hansika motwani mumbai news, hansika motwani gallery, hansika motwani photo gallery

hansika mumbai big property place orphaned children : the hot actress hansika motwani buy an acre place in mumbai for orphaned children to make asylum for them.

హన్సిక ముంబై ప్రాపర్టీ.. ఎవరికోసం?

Posted: 01/27/2015 12:23 PM IST
Hansika mumbai big property place orphaned children

స్టార్ హీరోయిన్’గా ఇండస్ట్రీలో అంతగా పేరు సంపాదించకపోయినప్పటికీ బోలెడన్ని సినిమాలో ఫుల్ బిజీగా వున్న హన్సిక.. ఇటీవలే ముంబైలో ఓ భారీ ప్రాపర్టీని కొనుగోలు చేసింది. ఎకరం విస్తీర్ణంలో వున్న ఈ స్థలానికి కోట్లాది రూపాయలు కూడా వెచ్చించింది. ఈ అమ్మడికి తనకంటూ ప్రత్యేకంగా ప్రాపర్టీ వున్నా కూడా ఇప్పుడీ కొత్త ప్రాపర్టీ కొనడం వెనుక కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడిపోయిందేమోనని కొందరు అంటుంటే.. పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టిందేమోనని మరికొందరు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే.. ఈ విషయమై స్పందించిన హన్సిక.. ఆ ఫ్లాట్ ఎందుకు..? ఎవరి కోసం..? కొన్నదో స్పష్టం చేసింది.

బొద్దుగుమ్మ హన్సిక ఈ స్థలం విషయమై మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని శివారు ప్రాంతంలో నేను ఇలాంటి ప్రాపర్టీ కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాను. ఇన్నాళ్లకు దొరికింది. ముంబై నుంచి గంటన్నర ప్రయాణంలో ఈ స్థలం వుంది. చాలా మంచి లొకాలిటీలో దొరికింది. ఈ లొకాలిటీ కోసమే ఇన్నాళ్లు వేచి చూశాను’’ అని స్థలం తీసుకున్నట్లు ధ్రువీకరించింది. అయితే ఈ ప్రాపర్టీ తీసుకున్నది తన కోసమే, తన కుటుంబం కోసమే, లేదా పెళ్లి సంబంధించిన కార్యక్రమాల నేపథ్యంలోగానే తీసుకున్నది కాదని పేర్కొంది. తాను ఇదివరకే దత్తత తీసుకున్న పిల్లల కోసం ఈ స్థలాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి మరీ తీసుకున్నట్లు తెలిపింది.

హన్సిక గతంలో కొందరు అనాథ పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే! అయితే.. దీని గురించి ఈ అమ్మడు ఎక్కువగా ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు ఆ పిల్లల కోసమే శాశ్వతంగా ఓ ఆశ్రమం నెలకొల్పడం కోసం ఈ ఫ్లాట్ తీసుకుందని చెప్పింది. ‘‘ఇప్పటికే ఈ స్థలంపై చాలా ఎక్కువ ధనాన్ని వెచ్చించాను. మరిన్ని నిధులు సమకూర్చుకున్న తర్వాత నిర్మాణాన్ని చేపడుతాను. అనాథ పిల్లల కోసం శాశ్వత ఆశ్రమాన్ని నిర్మిస్తాను’’ అని అంటోంది బొద్దుగుమ్మ. ఇంత చిన్న వయస్సులోనే ఇలా పిల్లల క్షేమం కోసం ఓ ఆశ్రమాన్ని నిర్మించడాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles