Mass maharaja ravi teja kick 2 movie teaser release

ravi teja news, ravi teja kick 2 movie news, kick 2 telugu teaser, kick 2 teaser, kalyan ram latest news, ravi teja kick 2 movie, rakul preet singh, surender reddy news

mass maharaja ravi teja kick 2 movie teaser release : the kick 2 movie teaser has released on republic day midnight.

మిడ్ నైట్ లో అభిమానులకు మాంచి ‘కిక్’ ఇచ్చిన రవితేజ

Posted: 01/26/2015 01:57 PM IST
Mass maharaja ravi teja kick 2 movie teaser release

టాలీవుడ్ మాస్ మహారాజాగా పేరొందిన హీరో రవితేజ.. మిడ్ నైట్ లో తన అభిమానులకు మాంచి ‘కిక్’ ఇచ్చాడు. దీంతో ఆయన అభిమానులందరూ ఫుల్ ఖుషీగా వున్నారు. సరికొత్త ప్రెజెంటేషన్’తో రవితేజ టాలీవుడ్’లో ప్రభంజనం సృష్టించాడు.

ప్రస్తుతం రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్-2’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. రవితేజ బర్త్’డే కానుకగా మూవీ ఫస్ట్ టీజర్’ను విడుదల చేశారు. మిడ్ నైట్’లో విడుదలైన ఈ టీజర్.. అప్పుడు యూట్యూబ్’లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ టీజర్’కి రవితేజ న్యూ లుక్, తమన్ మ్యూజిక్ హైలైట్’గా నిలిచాయి. ఎక్కడో తెలియని ప్రదేశంలో ఖాళీగా వున్న రైల్వే స్టేషన్’లో రవితేజ తన చేతిలో నాగలి పట్టుకుని వున్న ఆ సన్నివేశం అందరినీ ఆకట్టుకునే విధంగా వుంది. పైగా.. రవితేజ స్టైలిష్ లుక్, మేనరిజం సరికొత్తగా వుండటంతో ఆ టీజర్’కు క్లిక్కుల మీద క్లిక్కులు వచ్చేస్తున్నాయి. పైగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్’గా వుంది.

ఇదివరకు తన ‘రేసుగుర్రం’ మూవీ ఫస్ట్ టీజర్’ని ఏ విధంగా అయితే దర్శకుడు సురేందర్ విడుదల చేశాడో.. అదేవిధంగా ‘కిక్-2’ మూవీ టీజర్ రిలీజ్ చేసి తన దర్శకత్వ మార్క్’ని మరోసారి చూపించుకున్నాడు. ఇకపోతే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్’గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్’పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. సమ్మర్’లో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా.. ‘కిక్’లోని రవితేజ - ఇలియానా కుమారుడి కథే ఈ ‘కిక్ - 2’ అని చిత్ర బృందం తెలిపింది. మొదటి చిత్రం కంటే ఈ మూవీ పెద్ద హిట్ సాధిస్తుందని నమ్మకాన్ని వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi teja kick 2 movie  kalyan ram ntr arts  rakul preet singh news  

Other Articles