Brahmotsavam movie shooting schedule

Brahmotsavam movie shooting schedule, Brahmotsavam movie, Brahmotsavam cast and crew, Mahesh babu Brahmotsavam Movie, Mahesh babu movie Updates Mahesh Babu latest, Mahesh Babu latest movies, Mahesh Babu next movie, Mahesh Babu wallpapers, Mahesh Babu Koratala Shiva movie Update, Tollywood updates, Upcoming Telugu movies

Brahmotsavam movie shooting schedule : Mahesh Babu to start his latest movie Brahmotsavam shooting from may 2015. PVP Banner producing Mahesh Srikanth Addala second combination movie Brahmotsavam

ఆచి, తూచి అడుగులు వేస్తున్నాడు

Posted: 01/12/2015 08:36 AM IST
Brahmotsavam movie shooting schedule

గతేడాది అంతా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సంవత్సరంలో అలా కాకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. ప్రతి సినిమాను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ సినిమా షూటింగ్ జరుపుకుటోంది. ఇదిలా ఉండగానే ప్రిన్స్ కొత్త ప్రాజెక్టుపై సైన్ చేశాడు. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.., పీవీపీ బ్యానర్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ప్రిన్స్ తో మూడు సినిమాలు చేసేందుకు ఈ బ్యానర్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ప్రిన్స్ ఈ సినిమాలో నటించనున్నాడు. దీంతో ‘ముకుంద’ రిజల్ట్ తర్వాత మహేష్-శ్రీకాంత్ మూవీపై డౌట్ ఉందని వస్తున్న గాసిప్స్ కు తెరపడినట్లే. పీవీపీ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా మేలో షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టనుంది. సంక్రాంతి తర్వాత సినిమాలో మిగతా క్యారెక్టర్లు, టెక్నీషియన్లను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే మీకు మరిన్ని వివరాలు అందిస్తాము.

ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని మార్చి చివర్లో లేదా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ‘1నేనొక్కడినే’, ‘ఆగడు’ వరుస ఫ్లాపుల తర్వాత నటిస్తున్న ఈ సినిమాపై మహేష్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. బడ్జెట్, డైలాగులు, ఇతర విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని సినిమాలో నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam movie  PVP Productions  

Other Articles