Pawan kalyan gopala gopala movie punch dialogues controversy film political industries

pawan kalyan news, pawan kalyan punch dialogues, pawan kalyan gopala gopala movie, gopala gopala movie punch dialogues, gopala gopala movie news, venkatesh gopala gopala movie news, pawan kalyan controversy comments

pawan kalyan gopala gopala movie punch dialogues controversy film political industries : power star pawan kalyan punch dialogues in gopala gopala movie creates controversy in film and political industries

పంచ్: సమర్థులు ఇంట్లో వుంటే.. అసమర్థులు రాజ్యమేలుతారు!

Posted: 01/10/2015 11:36 AM IST
Pawan kalyan gopala gopala movie punch dialogues controversy film political industries

టాలీవుడ్ పవర్’స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సెన్సేషన్’గానే నిలిచిపోతుంది. అది నిజ జీవితంలోనే కాదు.. ఆఖరికి ఆయన తన సినిమాల్లో వేసే పంచ్ డైలాగులు కూడా కాంట్రోవర్సీగా వుండిపోతాయి. ఇదివరకు ఆయన చిత్రాల్లో వేసిన కొన్ని పంచ్ డైలాగులు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక ఆయన నటించిన తాజా చిత్రం ‘గోపాల గోపాలా’లో సైతం ఓ భారీ పంచ్ డైలాగ్ వుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ గురించే ఇప్పుడు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

పవన్ కల్యాన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘గోపాలా గోపాలా’ సంక్రాంతి కానుకగా శనివారం (10-01-2015)నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బుకింగ్స్ మూడోరోజులపాటు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఇక రిలీజ్’ రోజు అయితే అర్థరాత్రి నుంచి తెల్లవారులోపు బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. ఆయన వీరాభిమానులైతే వేలకు వేలు డబ్బులు పొగేసి మరీ ఈ మూవీకి వెళుతున్నారు.

ఇక విడుదలైన మొదటి షో నుంచే ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది. సినిమా చాలా బాగుందని, ఎంతో వినోదాత్మకంగా వుందని, ముఖ్యంగా ఇందులో పవన్ నటన ఎంతో అద్భుతంగా వుందని అంటున్నారు. అంతేకాదు.. ఈ చిత్రం ద్వారా జనాల్లోకి ఓ మంచి మెసేజ్ కూడా వెళుతుందని.. మూఢనమ్మకాలు దాదాపుగా తొలగిపోయే అవకాశాలు కూడా వున్నాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పవన్ పర్ ఫార్మెన్స్’కి థియేటర్లలో అందరూ స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారని సమాచారం.

ఇదిలావుండగా.. ఈ చిత్రంలో పవన్ చెప్పే కొన్ని డైలాగులు ఎంతో అద్భుతంగా వున్నాయి. ఆ డైలాగులు ప్రతిఒక్కరినీ ఆలోచింపచేసే విధంగా వున్నాయి. ఆ డైలుగుల్లో కొన్ని..

1. దారి చూపించడం వరకే నా పని...గమ్యాన్ని చేరుకోవడం మీ పని
2. నేను టైం కి రావడం కాదు తమ్ముడు..నేను వచ్చాకే టైం అవుతుంది
3. బరువు చూసే వాడికి కాదు మిత్రమా...మోసే వాడికి తెలుస్తుంది
4. సమర్థులు ఇంట్లో ఉండి పోతే...అసమర్థులు రాజ్యమేలుతారు..

అయితే.. ఇందులో నాలుగో డైలాగ్ కాస్త దుమారాన్ని రేపుతోంది. ఈ డైలాగ్ అప్పుడే సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఎవరినైనా ఉద్దేశించే ఈ విధమైన డైలాగులు పవన్ చేత చెప్పించారా.. లేదా ఆయనే స్వయంగా రాయించుకుని ఎవరికైనా పంచ్ ఇవ్వాలనుకుని ఇలా చెప్పారా..? అన్నది చెప్పుకుంటున్నారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. అందరూ రాజకీయ నాయకులనే ఉద్దేశించే ఈ డైలాగ్ చెప్పారా..? అన్నది అనుమానంగా వుందని విశ్లేషకులు అంటున్నారు. మరి.. పవన్ దృష్టిలో ఆ అసమర్థులు ఎవరో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles