Gopala gopala movie pre release records boxoffice collections

gopala gopala movie, gopala gopala collections, pawan kalyan latest news, pawan kalyan gopala gopala, victory venkatesh gopala gopala, venkatesh gopala gopala, pawan kalyan movies, gopala gopala movie collections, gopala gopala bookings, sriya saran news, sriya saran hot photo shoot, oh my god hindi movie

gopala gopala movie pre release records boxoffice collections : pawan kalyan, victory venkatesh multistarrer gopala gopala movie is ready to set new records in tollywood.

గోపాలుడి చరిష్మా షురూ.. బద్దలుకొట్టిన సరికొత్త రికార్డులు!

Posted: 01/09/2015 04:22 PM IST
Gopala gopala movie pre release records boxoffice collections

‘అత్తారింటికి దారేది’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేసిన పవర్’స్టార్ పవన్ కల్యాణ్.. ఈసారి విక్టరీ వెంకటేష్’తో కలిసి ‘గోపాల గోపాల’ మూవీ ద్వారా ఆ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సెన్సార్’తో సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 10వ తేదీ గ్రాండ్’గా రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ సినిమా.. బుకింగ్ లో మొదటి మూడు రోజులకి టికెట్స్ దాదాపు ఫుల్ అయిపోయాయని ట్రేడ్ వర్గాల సమాచారం!

ట్రేడ్ పండితుల ప్రకారం.. ఈ మూవీ కలెక్షన్లలో మొదటిరోజు సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. టాలీవుడ్’లో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమేరకు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇక ఫ్యామిలీ హీరోగా వెంకీ తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఈ ఇద్దరూ హీరోలు కలిసి వస్తున్న మూవీ కాబట్టి.. ఈ మూవీపై భారీగానే అంచనాలు పెరిగాయి. హిందీలో తెరకెక్కిన ‘ఓ మై గాడ్’ మూవీకి ‘గోపాల గోపాల’ రీమేక్ అయిన.. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఆడియెన్స్’ను థ్రిల్స్ చేసేలా వుంటాయని మూవీ యూనిట్ చెబుతోంది. పైగా మూడురోజుల బుకింగ్ ముందుగానే ఫుల్ అయ్యాయి కాబట్టి.. ఆ వీకెండ్’లో దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తోంది. కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించిన ఈ మూవీని సురేష్ బాబు - షరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. శనివారం రోజు విడుదల అవుతున్న ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుందని అంచనా! మరి.. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala recrods  pawan kalyan venkatesh  tollywood box office  

Other Articles