I movie censor completed gets u certificate

I movie censor, I movie gets U certificate, I movie delhi censor, I movie release date, I movie tickets booking, I movie wallpapers, I movie latest updates, I movie telugu trailer, I movie telugu audio launch photos, I movie telugu songs, I movie teaser, upcoming telugu movies, sankranti 2015 telugu movies

I movie censor completed gets U certificate : shankar finally win on CBFC, by getting U certificate for I movie. Delhi censor board gives U certificate to vikram, shankar's I movie. India waiting for south india showman movie release as Pongal gift

చివరకు శంకర్ గెలిచాడు.. కోట్లు వెనకేసుకుంటున్నాడు

Posted: 01/08/2015 03:28 PM IST
I movie censor completed gets u certificate

పట్టుదలతో పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని డైరెక్టర్ శంకర్ నిరూపించాడు. ఈ సూక్తి తాజా అంశానికి సరిగ్గా మ్యాచ్ కాకపోవచ్చు కానీ.., శంకర్ పట్టుదల గురించి ఇంతకంటే ఏమి చెప్పలేము. సెన్సార్ బోర్డుతో చేసిన యుద్ధంలో శంకర్ గెలిచాడు. ఉన్నత స్థాయి సెన్సార్ బోర్డులో ‘ఐ’ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఈ మూవీకి చెన్నై బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. వద్దని ముంబైకి వెళ్తే అక్కడ కూడా సేమ్ తీర్పు వచ్చింది. దీంతో చివరి ప్రయత్నంగా ఢిల్లీలోని ఉన్నత స్థాయి సెన్సార్ బోర్డును ఆశ్రయించాడు.

‘ఐ’ సినిమా చూసిన సెన్సార్ పెద్దలు ‘యు’ ఇవ్వవచ్చు అని నిర్ణయించుకుని క్లీన్ ‘యు’ ఇచ్చేశారు. దీంతో శంకర్ కోరిక నెరవేరింది. ఇంతకీ ‘యు’ కోసం ఎందుకు ఇంతగా కష్టపడ్డాడో తెలుసా.., కోట్ల రూపాయల డబ్బుల కోసం. క్లీన్ ‘యు’ సర్టిఫైడ్ సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో ఈ సర్టిఫికెట్ కోసం అంతగా తంటాలు పడ్డాడు. చివరకు అనుకున్నది సాధించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. సెన్సార్ సహా అన్ని పనులు పూర్తి కావటంతో జనవరి 14న విక్రమ్ మూవీ ప్రప్రంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సెన్సార్ పై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరో విషయం ఏమిటంటే.., సినిమా రన్ టైం కూడా చాలా ఎక్కువగా ఉందట. ఏకంగా 188 నిమిషాల రన్ టైం ఉన్నట్లు చెప్తున్నారు.

తెలుగు, తమిళ, హిందీ సహా దేశంలోని పలు భాషల్లో ఈ మూవీని డబ్ చేశారు. అంతేకాకుండా.., చైనా వంటి ప్రపంచ భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. సౌత్ ఇండియన్ సినిమా ఈ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావటం ఇదే తొలిసారి. చియాన్ విక్రమ్ మూడు పాత్రల్లో కన్పించనున్నాడు. 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై రవిచంద్రన్ ఈ మూవీని నిర్మించారు. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమీకు ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I movie  censor board  2015 sankranti movies  

Other Articles