Chiranjeevi 150 movie tamil director shankar i movie news

chiranjeevi, chiranjeevi political life, chiranjeevi movie life, director shankar, i movie, chiru 150 movie, chiru 150th film, chiranjeevi latest news, chiranjeevi director shankar, director shankar chiru movie

chiranjeevi 150 movie tamil director shankar i movie news : There are some rumours going on in cine industry that chiranjeevi may do 150 film in shankar direction.

చిరుతో శంకర్ రాయబారాలు.. 150వ చిత్రానికి సన్నాహాలు..

Posted: 01/07/2015 10:32 AM IST
Chiranjeevi 150 movie tamil director shankar i movie news

ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు శంకర్ కలయికలో భారీ బడ్జెట్’తో కూడిన చిత్రం రూపుదిద్దుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అటు చిరుతో ఓ చిత్రం తీయాలనే ఆలోచనతో శంకర్ రాయాబారాలు చేస్తున్నారని.. మరోవైపు ఇటీవలే శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి వ్యక్తం చేయడంతో వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం రానుందనే ఊహాగానాలు మరింతగా బలపడుతున్నాయి.

149 చిత్రాలు పూర్తి చేసుకుని రాజకీయాలవైపు అడుగులు వేసిన చిరు.. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో వాటికి దూరంగా వుండి ఇప్పుడు 150వ చిత్రం చేసి తిరిగి తన మెగాపవర్’ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైపోయారు. నిజానికి గతేడాది ఆయన జన్మదిన వేడుకల సందర్భంగానే ఆ చిత్రం ఆరంభం అవుతుందన్న ప్రచారం సాగింది కానీ.. మంచి కథ దొరకకపోవడంతో అది ప్రారంభం కాలేదు. పైగా.. మాంచి క్రేజ్ వున్న దర్శకుడితోనే మూవీ చేయాలనే ప్లానింగ్’లో వున్నట్లు తెలిసింది. మొదట తెలుగు డైరెక్టర్లందరినీ సంప్రదించారు. మొన్నటివరకు వినాయక్ దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయిగానీ.. ఈమధ్యే చిరు మరోసారి శంకర్’తో మూవీ చేయాలనుందని ఆసక్తి వ్యక్తం చేయడంతో ఆయనతో మంతనాలు జరిపే ఛాన్స్ వుందని అనుకుంటున్నారు.

ఇక విక్రమ్ హీరోగా ‘ఐ’ చిత్రాన్ని పూర్తి చేసిన డైరెక్టర్ శంకర్.. ఇటీవల జరిగిన ఆ మూవీ తెలుగు ఆడియో ఫంక్షన్’లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వ్యక్తం చేశారు. తనను ఎంతగానో అభిమానిస్తున్న తెలుగు ఆడియెన్స్ కోసం ఖచ్చితంగా ఓ డైరెక్ట్ తెలుగు మూవీని తెరకెక్కిస్తానని తెలిపారు. చాలాకాలంగా తెలుగులో చిత్రం చేయాలని అనుకున్నట్లుగా తెలిపారు. అంతేకాదు.. గతంలో చిరుతో కలిసి చేస్తానని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలావుండగా.. చిరుతో చిత్రం చేసేందుకు శంకర్ రాయాబారాలు చేస్తున్నట్లు ఆసక్తికరమైన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ.. ఈ వార్తలు మాత్రం నిజమైతే.. మెగాభిమానులకు పండగే పండగ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi 150 movie  director shankar news  chiru shankar  

Other Articles