Shah rukh khan atharva the origin mythical hero graphic novel

shahrukh khan news, shahrukh khan atharva, atharva the origin, shahrukh khan mythical hero, shahrukh khan latest movie news, shahrukh khan atharva movie news, atharva the origin navel, shahrukh khan graphical design movie

shah rukh khan atharva the origin mythical hero graphic novel : bollywood baadshah shah rukh khan starring in atharva the origin movie as mythical hero who sets out to uncover his destiny.

గమ్యం కోసం పరుగులు తీస్తున్న షారుఖ్!

Posted: 01/06/2015 01:49 PM IST
Shah rukh khan atharva the origin mythical hero graphic novel

బాలీవుడ్ బాద్’షా షారుఖ్ ఖాన్ తన గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కష్టనష్టాల మధ్య పరుగులుపెడుతూ.. తనను ఇబ్బంది కలిగిస్తున్న ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తూ ముందడుగు వేస్తున్నాడు. అదేంటి.. కింగ్ ఆఫ్ బాలీవుడ్’గా పేరుగాంచిన షారుఖ్’కి ఇప్పుడు అన్ని కష్టాలు ఎందుకొచ్చాయని అనుకుంటున్నారా..? అయితే షారుఖ్ తన గమ్యస్థానం కోసం పరుగులు పెడుతున్నది రియల్ లైఫ్’లో కాదు.. రీల్ లైఫ్’లో!

అసలు విషయం ఏమిటంటే.. మునుపెన్నడులేని విధంగా మొదటిసారిగా ‘అథర్వా - ది ఆరిజిన్’ అనే గ్రాఫికల్ మైథాలాజికల్ నావెల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన ఫస్ట్’లుక్ టీజర్’కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నావెల్’లో షారుఖ్ అథర్వ అనే పాత్రలో పోషించనున్నాడు. పురాణాల కథల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇందులో అథర్వ తన గమ్యస్థానం ఏంటో తెలుసుకోవడం కోసం ఎన్నో దుష్టశక్తులను, ఇబ్బందులను ఎదుర్కొంటూ పరుగులు తీస్తుంటాడు. మరి.. అతగాడు ఎలా చేరుకుంటాడు.. ఏ ఇబ్బందులను ఎదుర్కొంటాడు.. ఇంకా ఏం జరుగుతుందోనన్న వాటిపై ఈ కథ నడుస్తుంది.

ఇక ఈ ప్రాజెక్ట్’ని చెన్నైకి చెందిన విర్జు స్టూడియోస్ వాళ్లు నిర్మిస్తున్నారు. రమేష్ తమిళ్’మాని రాసిన ఈ నావెల్’ను విన్సెంట్ అడైకలరాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 3D విజ్వువలైజేషన్’తో తెరకెక్కిస్తున్న ఈ గ్రాఫికల్ డిజైన్ నావెల్’ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఈ నావెల్’కి సంబంధించిన టీజర్ మీరు వీక్షించండి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan news  atharva the origin navel  virzu studios  

Other Articles