Puri jagannath recruits new directors

Puri Jagannath, Puri Jagannath latest, Puri Jagannath new directors recruitment, Puri Jagannath new directors contest, Puri Jagannath taking new directors, Puri Jagannath latest updates, tollywood movie chances, cinema acting chances, tollyood latest, telugu movie updates, telugu movies latest, upcoming telugu movies

Puri Jagannath recruits new directors : successful director Puri Jagannath started recruiting new directors. Puri Jagannath will recruit new directors soon to bring new talent into limelight

కొత్త ఏడాదికి పూరీలు కావలెను

Posted: 12/31/2014 10:00 AM IST
Puri jagannath recruits new directors

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్. మాస్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసే ఈయన చాలా వేగంగా ప్రాజెక్టు తెరకెక్కించగల సత్తా ఉన్న వ్యక్తి. సమయం వృధా చేయకుండా కేవలం రెండు లేదా మూడు నెలల్లో సినిమా షూటింగ్ ముగించేస్తాడని పేరు ఉంది. కొత్తదనంను బాగా ఇష్టపడే పూరీ ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయటంలోనూ ముందుంటాడు. గతంలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. మళ్లీ కొత్త టాలెంట్ కోసం వెతుకులాట ప్రారంభించాడు.

రెండు నెలల క్రితం కొత్త రచయితల కోసం పూరీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా డైరెక్టర్ల కోసం ఈ డైరెక్టర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రకటించాడు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు గాను ఓ టీవీ ఛానెల్, పేపర్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ టాలెంట్ హంట్ కోసం ప్రకటన కూడా విడుదల చేస్తున్నారు. ఆసక్తిగల వారు.., పూరి ఇచ్చే కాన్సెప్టులకు పది నిమిషాల నిడివి ఉండే షార్ట్ ఫిలిం డైలాగులతో సహా తీసి పంపాల్సి ఉంటుంది.

సినిమాలు తీయాలని తహతహలాడుతున్న యువతరానికి ఇదో సదావకాశం అనే చెప్పాలి. ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నవారంతా టాలెంట్ నిరూపించుకునే సమయం వచ్చేసింది. లేచి కెమెరా పట్టుకుని షూటింగ్ మొదలు పెట్టేయండి.., అన్నీ కుదిరితే మీరే త్వరలో మెగా ఫోన్ పట్టుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannath  tollywood directors  tollywood latest  

Other Articles