మంచు ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఓ స్పెషాలిటీ ఉంది. వారింట్లో ఎవరికైనా ఒక హీరోయిన్ నచ్చిందంటే చాలు.., అందరూ సినిమాల్లో వాడేసుకుంటారు. అన్న, తమ్ముడు, అక్క అనే తేడా లేదు ముగ్గురూ.., ఫ్యామిలీ ప్యాకేజ్ గా హీరోయిన్ ను సినిమాల్లో వాడుకుంటారు. గతంలో తాప్సి ఇలాగే అందరితో నటించింది. ఇప్పుడీ ప్లేస్ ను, బబ్లీ గర్ల్ ప్రణీత రీప్లేస్ చేస్తోంది. గతంలో తమ్ముడు మనోజ్ తో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో చిందేసిన ఈ అమ్మడు ఇప్పుడు అన్నయ్యతో జతకట్టనుంది.
సినిమా యూనిట్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.., దేవ కట్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటిస్తోందట. త్వరలోనే మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటుందని తెలిపారు. తమిళ హిట్ మూవీ ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో త్రిదా చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత త్రిదా కాదు అదా అని టాక్ వచ్చింది. చివరకు వీరిద్దరూ కాదు ప్రణిత అని కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మంచు విష్ణు.., ప్రాజెక్టు కోసం బాగా కష్టపడుతున్నాడు. బ్యాంకాక్ వెళ్ళి మరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాుడు. ఈ మద్యే ఆయన మార్షల్ ఆర్ట్స్ లుక్ విడుదల చేశారు. కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీ అభిమానులు సరైన సినిమా లేక అసంతృప్తితో మునిగిపోయారు. వారందరికీ ఈ మూవీ జోష్ ఇస్తుందని నమ్ముతున్నారు. మరి మంచు ఫ్యామిలీని తమిళ సినిమా ఆదుకుంటుందా.., లేదా అనేది విడుదల అయితే తెలుస్తుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more