Ram gopal varma apologises k balachandar death tweet

ram gopal varma sorry on balachandar, ramgopal varma on balachandar death, ram gopal varma balachandar death tweet, ram gopal varma latest updates, k balachandar health update, k balachandar latest news, k balachandar hospitalized, tollywood latest news updates

ram gopal varma apologises k balachandar death tweet : ram gopal varma says apology for his mistake tweet on k. balachandar death, rgv feels sorry over balachanda death tweet by him later he knows truth and says sorry for that

తప్పు చేసినా.. మొదటి సారి మంచి చేశావు

Posted: 12/17/2014 04:35 PM IST
Ram gopal varma apologises k balachandar death tweet

ఏ మనిషికైనా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు. తొందరపడి తప్పు చేసినా.., క్షమాపణలు చెప్పి సరిదిద్దుకోవచ్చు. అయితే ఈ పని రామ్ గోపాల్ వర్మ చేశాడు అంటేనే వినటానికి కాస్త వింతగా ఉంది. కె.బాలచందర్ చనిపోయారంటూ మంగళవారం రోజు వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘భారతీయ సినిమాకు దిగ్గజంగా ఉన్న బాలచందర్ మృతి బాధాకరం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అయితే బాలచందర్ ఆరోగ్యం విషమంగా ఉన్నా.., ఆయన కోలుకుంటున్నారని చికిత్స అందిస్తున్న డాక్టర్లు ప్రకటించారు.

దీంతో వర్మ ట్వీట్ పై చాలా విమర్శలు వచ్చాయి. నోటి దురుసు, ఎగతాళి మరీ ఇంతగా ఉండకూడదు అని బాగానే కామెంట్లు పడ్డాయి. అటు ఈ ట్వీట్ సోషల్ మీడియాతో పాటు.., మూవీ వెబ్ సైట్లలో కూడా ప్రచారం కావటంతో వర్మపై మాటల దాడి మరీ పెరిగింది. దీంతో క్షణాల్లోనే ట్వీట్ ను తొలగించేశాడు. అయితే ఇది ప్రమోషన్ కోసం, పాపులారిటి కోసం కాకుండా పుకార్ల వల్ల మాత్రమే చేసినట్లు క్లారిటి ఇచ్చాడు. బాలచందర్ చనిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఇవి వర్మకు కూడా చేరటంతో నిజమని నమ్మి సానుభూతి ప్రకటించారు.

చివరకు పుకారు తప్పని తేలటంతో పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పాడు. ‘బాలచందర్ పై చేసిన కామెంట్ కు చింతిస్తున్నా.., ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని కామెంట్ చేశాడు. సాధారణంగా అయితే వర్మ కావాలని ప్రమోషన్ కోసం కామెంట్లు చేసి కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటాడు. ఎంత తీవ్ర విమర్శలు, కామెంట్లు చేసినా వాటికి క్షమాపణలు మాత్రం చెప్పడు. అలాంటిది బాలచందర్ విషయంలో సారి చెప్పేసరికి పర్వాలేదు నీలోనూ మంచితనం ఉంది అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇంకొందరయితే వర్మ చేసిన మొదటి మంచిపని ఇది అని వ్యంగ్యంగా కామెంట్లు చేసుకుంటున్నారు.
 
కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  balachandar hospitalized  rgv twitter  

Other Articles