Nandamuri balakrishna latest movie godse lion first look trisha krishna radhika apte

nandamuri balakrishna news, balakrishna latest movie, balakrishna godse movie first look, balakrishna first look, balakrishna new movie first look, balakrishna lion movie, balakrishna trisha krishna, balakrishna radhika apte, director satyadeva, producer rudrapati ramanarao, balakrishna godse first look, balakrishna lion first look

nandamuri balakrishna latest movie godse lion first look trisha krishna radhika apte

ఫస్ట్’లుక్ : కేక పుట్టిస్తున్న బాలయ్య ‘లుంగీ’ గెటప్

Posted: 12/05/2014 09:12 PM IST
Nandamuri balakrishna latest movie godse lion first look trisha krishna radhika apte

ఐదుపదుల వయస్సు మీదపడినా నేటి యువకథానాయకులతో ధీటుగా సరికొత్త గెటప్స్’లతోబాటు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్నారు నందమూరి బాలకృష్ణ! గతసినిమాలతో పోల్చుకుంటే ఇటీవలే వచ్చిన ‘‘సింహా, లెజెండ్’’ చిత్రాల్లో ఆయన నటన, మేనరిజమ్, కొత్త లుక్స్, డాన్సింగ్ స్టైల్ ప్రేక్షకులను బాగానే అలరించేశాయి. అందుకే.. ఆ చిత్రాలు భారీ కలెక్షన్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలోనే సంచలనాలను సృష్టించడానికి రెడీ అయ్యారు బాలయ్య!

నూతన దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో బాలయ్య తాజా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! గతకొన్నాళ్లనుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ఫస్ట్’లుక్ విడుదలయింది. ఇందులో కూడా బాలయ్య సరికొత్త గెటప్’లో సూపర్బ్’గా కనిపిస్తున్నారు. పైకి మడిచి కట్టిన గళ్ళ లుంగీ... బనీను మీద నీలం రంగు షర్టు... అందమైన కళ్లజోడు... పెదవులపై చిరునవ్వు... నడచివస్తున్న ఆ స్టయిలు... ఆయన గెటప్పు 'కేక' అనిపిస్తోంది. అభిమానులను ఎంతగానో అలరించే విధంగా గెటప్ అదిరిపోయింది.

ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి ‘గాడ్సే’ టైటిల్ దాదాపుగా ఖరారయిందని, క్యాప్షన్’గా ‘ది లయన్’ అంటూ వార్తలొస్తున్నాయి. గతంలో కూడా ఈ టైటిల్స్’లే కొన్నాళ్లపాటు ప్రచారం చేశాయి కానీ యూనిట్ వర్గాలు వాటిని ఖండించాయి. అయితే ఈసారి మాత్రం ఆ రెండి టైటిళ్లను కలిపి ఫిక్స్ చేయనున్నారని సమాచారం! రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ తారలు ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

‘లెజెండ్’లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం కావడంతో దీనిపై చాలా ఎక్స్’పెక్టేషన్స్ వున్నాయి. భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి వేడుక సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ ఫస్ట్’లుక్’ని విడుదల చేయనున్నారని చెబుతున్నారు.

balakrishna-new-getup-still

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna new movie first look  trisha krishna balayya  radhia apte movie  

Other Articles