Telugu actress anjali latest telugu movie bhagamathi character hyderabad periodic story movie unite members

actress anjali, anjali latest news, anjali hot photos, anjali photo shoot, anjali photo gallery, anjali bhagmati movie, hyderabad periodic movies, bhagmati story, anjali news, anushka shetty, anushka shetty hot photo shoot

telugu actress anjali latest telugu movie bhagamathi character hyderabad periodic story movie unite members

అంజలికి ఆ ‘భాగ్యం’ కలగలేదట!

Posted: 12/04/2014 09:39 PM IST
Telugu actress anjali latest telugu movie bhagamathi character hyderabad periodic story movie unite members

మూవీ ఆఫర్లు లేక అల్లాడిపోతున్న తెలుగునటి అంజలికి ఇటీవలే అనుకోకుండా ఓ అవకాశం వరించిన సంగతి తెలిసిందే! 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో భాగమతి పేరిట రూపొందబోతున్న చిత్రంలోనే ఆమెకు లీడ్ రోల్’లో నటించే బంపరాఫర్ వచ్చింది. మొదట్లో ఈ సినిమాకి కథానాయికగా అనుష్కను అనుకున్నారు కానీ.. ఆమె డేట్స్ సమస్య వల్ల ఆ ప్రాజెక్టు చేయనని తప్పుకుంది. దాంతో అంజలిని ఖరారు చేసుకున్నారు.

ఇకపోతే.. ఈ సినిమా ఒక పిరియాడిక్ చిత్రమని, హైదరాబాదు చరిత్రకు సంబంధించిన భాగమతి కథను తెరకెక్కిస్తున్నారనీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మీడియాలో వస్తున్న ఆ వార్తలను యూనిట్ వర్గాలు ఖండించారు. అది కేవలం ఒక సోషల్ ఫిక్షన్ మూవీ మాత్రమేనని.. చరిత్రకు చెందిన భాగమని కథ ఎంతమాత్రం కాదని వాళ్లు స్పష్టం చేశారు. ఒక కల్పిత ప్రేమ కథాంశంతోనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వాళ్లు పేర్కొంటున్నారు.

ఇలావుండగా.. ‘గీతాంజలి’ లాంటి హిట్ చిత్రంలో నటించినప్పటికీ సరిగ్గా ఆఫర్లు లేకపోవడంతో ఇతర ఇండస్ట్రీల బాటపట్టిన అంజలికి.. రాకరాక వచ్చిన ఈ అవకాశంతో ఫుల్ ఖుషీగా వుందని సమాచారం! ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని టాలీవుడ్’లో పరీక్షించుకోవాలని అనుకుంటోందట! ఆ సినిమా సక్సెస్ కోసం ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందని అంటున్నారు. మరి.. ఈ సినిమాతోనైనా అంజలి దశ తెలుగు ఇండస్ట్రీలో తిరుగుతోందో..? లేదో..? చూడాలి!!!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles