Tolly wood programme memu saitham begins to help hudhud toofan victims

tollywood, memu saitham, hud hud victims, tollywood celebrities, movie stars, heroins, singers, top stars, selfies, dance, rampwalk, colourful

Tolly wood programme memu saitham begins to help hudhud storm victims

బాధితుల కోసం తమ బాధ్యతగా.. ముందుకు కదిలిన సినిమాలోకం..

Posted: 11/30/2014 01:27 PM IST
Tolly wood programme memu saitham begins to help hudhud toofan victims

హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడుు కోటి స్వరపర్చిన మేమే సైతం అనే గీతాన్ని పలువరు గాయకులు ఆలపించి ఆహుతులను అకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నిధులను తెలుగు సినీ పరిశ్రమ హుద్ హుద్ తుపాను బాధితులకు విరాళంగా ఇవ్వనుంది. అయితే ఇప్పిటికే పలువురు తారలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించగా.. మరికొందరు తారలు ఈ కార్యక్రమంలో భాగంగా తమ విరాళాన్ని ప్రకటించనున్నారు.

కాగా కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి 'డైన్ విత్ స్టార్స్' కార్యక్రమం తారల తళుకుబెళుకల మధ్య అట్టహాసంగా సాగింది. సహాయనిధి సేకరణ కార్యక్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేసిన సినీ అభిమానులు తారలతో కలసి విందులో పాల్గొన్నారు. వినోద కార్యక్రమాలను ఆస్వాదించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''ఎంతో అందమైన నగరం విశాఖపట్నం. హుద్‌హుద్ తుపాను అందరిలోనూ విషాదాన్ని నింపింది. చాలామంది బాధితులయ్యారు. ప్రతి ఒక్కరికీ మేం బాసటగా ఉంటామని 'మేము సైతం' ఏర్పాటు చేసింది చిత్ర పరిశ్రమ. స్వచ్చందంగా ముందుకొచ్చి తమవంతు సహాయాన్ని అందించిన వారందరికీ చిత్రపరిశ్రమ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన''న్నారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/memu-saitham

బాలకృష్ణ మాట్లాడుతూ ''విశాఖపట్నం నా రెండో ఇల్లులాంటిది. హుద్‌హుద్ తుపానుతో ఆ ప్రాంత వాసులు చాలా నష్టపోయారు. దైవం మానుష్య రూపేణా అన్నట్లుగా వాళ్లను ఆదుకోవడానికి ప్రజలు స్వచ్చంధంగా ముందుకొచ్చారు. తెలుగు పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని చాటి చెబుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన కుటుంబంలో ప్రేక్షకులు కూడా భాగం కాబట్టి వాళ్లకు ఎటువంటి అవసరమున్నా సాయం చేసేందుకు ముందుకు రావాలనే లక్ష్యంతోనే 'మేముసైతం' ఏర్పాటు చేశామ''న్నారు.

హైలెట్స్..
లెజెండ్'లోని 'నీ కంటి చూపుల్లో...' పాటను బాలకృష్ణ ఆలపించారు. హుషారు పాటలకు బాలకృష్ణ వేసిన స్టెప్పులు అతిథులను ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి వచ్చిన అతిథులను తారలందరూ దగ్గరకెళ్లి పలకరించి... వాళ్లతో సెల్ఫీలు దిగడం ఆకట్టుకుంది. వేదికపై సీనియర్, యువ నాయకానాయికలు ర్యాంప్ వాక్ అభిమానులను అలరించింది. బాధితుల సహాయార్థం కథానాయిక కాజల్ రూ. ఐదు లక్షల చెక్కును చిరంజీవికి వేదికపై అందజేసింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌షోలో వెంకటేష్, అల్లు అర్జున్, మంచు మనోజ్, నవదీప్ తదితర నటులు చిందేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles