Sv krihsna reddy thanks letter to fans on yamaleela 2

yamaleela2 release date, yamaleela2 latest songs and photos, yamaleela2 overseas release, sv krishna reddy on yamaleela2, s v krishna reddy movies, sv krishna reddy telugu comedy family movies, mohan babu in yamaleela 2 movie, tollywood latest news updates

sv krihsna reddy thanks letter to fans on yamaleela 2 : director sv krishna reddy says thanks for releasing his movie yamaleela2 in overseas on thanks giving day. sv krishna reddy promises fans that yamaleela2 will entertain full family with natural and real comedy also hopes this project will entertain family

మోహన్ బాబు లీలలపై ఎస్వీ బహిరంగ లేఖ

Posted: 11/26/2014 10:56 AM IST
Sv krihsna reddy thanks letter to fans on yamaleela 2

ఫ్యామిలి, కామెడి సినిమాలు కలిపి తీసే డైరెక్టర్  ఎస్వీ కృష్ణారెడ్డి తాజా సినిమా ‘యమలీల2’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈనెల 28న ఈ మూవీ విడుదల కానుంది. ఇక ఓవర్ సీస్ లో థ్యాంక్స్ గీవింగ్ డే రోజున సినిమా విడుదల అవుతుంది. చాలాకాలం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఎస్వీ.., ఈ మూవీలో తన మార్కు కామెడి ఉంటుందని ధీమాగా చెప్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా చాలా కాలం తర్వాత మళ్ళీ రాబోతుంది అని చెప్పాడు. ఇక ఈ మూవీని ఆదరిస్తారనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులకు డైరెక్టర్ లేఖ రాశారు. ఆ లేఖను మీకోసం అందిస్తున్నాం.


నమస్కారం,

    కాలం చాలా విలువైనది. పైగా శని, ఆది వారాలు అయితే మరీ ఎక్కువ. దానికి థ్యాంక్స్ గివింగ్ డే తోడైతే..? చెప్పాలా..? ఫ్యామిలి అంతా కలిసి పకపకా నవ్వుతూ ఫుల్ జోష్ లో పండగ చేస్కోవాలి. సరిగ్గా అటువంటప్పుడే కావాలి ఓ ఫుల్ కామెడి సిన్మా. అంటే, ఓ వినోదం, మాయలోడు, ప్రేమకు వేళాయెరా, పెళ్ళాం ఊరెళితే, నంబర్ వన్, శుభలగ్నం, యమలీల, ఇలా.... అందుకే, ఇలాంటి సిన్మాలు మళ్ళీ చేయటం మొదలుపెట్టా.‘యమలీల2’ చేసి మీ ముందు పెట్టా. సరదాగా హాయిగా ఫ్యామిలితో రండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పక పక పక నవ్వుకుని, నవ్వులు పోగేసుకుని, కూడా తీసుకెళ్ళండి.

    అప్పటి యమలీలలో ‘భవిష్యవాణి’ పొగొట్టుకున్న బ్రహ్మానందం మరోసారి ఇందులో ఆ బుక్ పోగొట్టుకుని యముడితో పడే తంటాలు ‘‘టామ్&జెర్రి’లా నవ్విస్తాయి. ‘నవ్వేయండి’. ఆశిష్ విద్యార్థి, షియాజి షిండే, గబ్బర్ సింగ్ బ్యాచ్ కలిసి చేసే విలన్ కామెడికి ‘ప్రిపేర్ అయిపొండి’. అటు సదా, ఇటు నిషా కొఠారి యముడితో చేసే పాటలు కనువిందు చేస్తాయి. ‘సిద్ధంకండి’, హీరో మాస్ ఫైట్లు, హీరోయిన్ చిలిపి నవ్వులు ‘కళ్ళతో పట్టేయండి’. తియ్యటి సంగీతానికి మళ్ళీ ‘స్వాగతం చెప్పండి’. ఇందులో ఓ చిన్నపాప మీ మనసులో చోటు సంపాదిస్తుంది. ‘ఇవ్వండి’.

    ఇది ఎస్.వి.కృష్ణారెడ్డి క్లీన్ కామెడి సిన్మా అని మరోసారి మీ మెప్పుకోలు కోసం, మీ కళ్ళ ముందు నా ‘కృషి’ని పెడుతూ.....

                                                    వినమ్రతతో
                                                        మీ
                                                    ఎస్.వి.కృష్ణారెడ్డి


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yamaleela2  sv krishna reddy  mohan babu  tollywood  overseas  

Other Articles