Tollywood star comedian ali setires telugu comedians hero sunil yamaleela 2 movie

comedian ali, star comedian ali, comedian ali satires, comedian ali latest news, comedian ali tv show, comedian ali news, comedian ali comments, yamaleela 2 platinum disc, yamaleela 2 movie, yamaleela 2 movie news, yamaleela 2 movie review, mohan babu, hero sunil, telugu hero sunil, comedian sunil news

tollywood star comedian ali setires telugu comedians hero sunil yamaleela 2 movie

కమెడియన్ల మీదే సెటైర్లు వేసేసిన ఆలీ!

Posted: 11/24/2014 10:59 AM IST
Tollywood star comedian ali setires telugu comedians hero sunil yamaleela 2 movie

టాలీవుడ్’లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆలీ.. ఈమధ్య అవకాశం దొరికినప్పుడల్లా కొంతమందిని టార్గెట్ చేసుకుని పంచ్’లు భలే వేసేస్తున్నాడు. ఆమధ్య యాంకర్స్, హీరోయిన్లను ఉద్దేశించి అప్పుడప్పుడు ‘బూతు’ పంచ్’లు వేసిన ఆలీ.. తాజాగా తెలుగు ఇండస్ట్రీలోని కమెడియన్లను టార్గెట్ చేసుకుని బాగానే సెటైర్లు వేసేశారు. అయితే ఈసారి అందరి కమెడియన్లమీద కాకుండా.. ఎవరైతే కామెడీ ట్రాక్ నుంచి తప్పుకుని హీరోగా చెలామణీ అవుతున్నారో.. వాళ్లనుద్దేశించి ఆలీ భారీగానే గునపం దించేశాడు! ఇప్పుడు అదే తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈమధ్యే జరిగిన ‘యమలీల-2’ ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్’లో ఈ కమెడియన్ మాట్లాడుతూ.. ‘‘యమలీల హిట్ అవగానే నేను హీరోగానే సినిమాలు చేస్తానని.. కమెడియన్ పాత్రలు వదిలేస్తానని అనుకున్నారు. కానీ నిర్మాత నిర్మాతగాను, గాయకుడు గాయకుడిగానే వుండాలి. అలాగే కమెడియన్ కమెడియన్’గానే వుండాలి.  ఎందుకంటే.. ప్రజలు ఏం చేస్తే ఆదరిస్తారో అలా నడుచుకుంటేనే సక్సెస్ పొందగలం. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. ఇది తెలియక ఈమధ్య అందరూ వేరే మార్గాలు చూసుకుంటున్నారు. కానీ నేనలా చేయలేదు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా.. నేను కమెడియన్ బాట వదల్లేదు’’ అని అన్నాడు.

ఆలీ ఈ విధంగా మాట్లాడటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది. గతకొన్నాళ్ల నుంచి కమెడియన్’గా కొనసాగుతూ తర్వాత హీరోగా చెలామణీ అవుతున్న కమెడియన్లలో చాలామందే వున్నారు. అయితే అందులో హీరో సునీల్ తప్ప.. మిగతావాళ్లందరూ అటు కమెడియన్, ఇటు హీరోగానూ కొనసాగుతున్నారు. దీంతో ఆలీ, సునీల్’ని ఉద్దేశించే ఈ విధంగా కామెంట్లు చేశాడని అందరూ అనుకుంటున్నారు. ఆలీ చెప్పిన మాటలు కాస్త పక్కనపెడితే.. ఏ విధంగా అయితే సునీల్ తన కమెడియన్ పాత్రలతో ఆడియెన్స్’ను మెప్పించాడో.. అ విధంగా తన హీరోయిజంతో మెప్పించలేకపోతున్నాడు. అందుకే.. కామెడీ, హీరోగా రెండు ట్రాకుల్లోనూ సునీల్ నడుచుకుంటే మంచిదని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian ali  hero sunil  yamaleela 2 movie  mohan babu  telugu news  

Other Articles