Director rajamouli junior ntr combination movies fans twitter

director rajamouli, rajamouli news, rajamouli latest news, rajamouli twitter, rajamouli latest comments, rajamouli junior ntr, junior ntr movie, junior ntr fans, rajamouli movies, junior ntr movies, tollywood news, telugu news

director rajamouli comments on junior ntr film career that he will prove his strength again by getting huge hit movie in soon

యంగ్ టైగర్ అభిమానుల సహనంతో ఆడుకుంటున్న జక్కన్న!

Posted: 11/15/2014 01:19 PM IST
Director rajamouli junior ntr combination movies fans twitter

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న విషయం తెలిసిందే! భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అందుకే.. సినిమా షూటింగ్ రెండేళ్లు పడుతుందని ముందుగానే తెలుగు అభిమానులకు తెలియపరిచి.. తన పని తాను చేసుకుంటున్నాడు. ఇదిలావుండగా.. ఇంతవరకు ఓటమి ఎరుగని ఈ దర్శకుడితో కనీసం ఒక్కసారైనా పనిచేయాలని ఏ స్టార్ హీరో అయినా అనుకుంటారు. ఇప్పటికే పలువురు హీరోలు జక్కన్న దర్శకత్వంలో నటించాలని వుందంటూ తమ అభిప్రాయాలు వెల్లడించారు కూడా! అటువంటివారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వున్నాడులెండి!

జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘‘స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ’’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే! ఆ సినిమాలతోనే ఎన్టీఆర్ తన సత్తా చాటుకున్నాడు. అయితే ఇతర దర్శకులతో ఇతను తీసిన సినిమాలు కొన్ని ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. మరికొన్ని భారీగా బోల్తాపడ్డాయి. ప్రస్తుతం వరుస పరాజయాలతో పూర్తిగా డీలా పడిపోయాడు ఎన్టీఆర్! అందుకే.. రాజమౌళితో సినిమా తీయాలనే ఆలోచనలో వున్నాడని సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక వార్తలు ఇంకా బయటికి రాలేదుకానీ.. జూనియర్ మాత్రం వరుస పరాజయాలతో తీవ్ర అసహనంతో, నిరాశతో వున్నాడని టాక్! అలాగే అభిమానులు కూడా తమ అభిమాన హీరోకు ఎక్కువ పరాభవాలు ఎదురుకావడంతో వాళ్లు కూడా తీవ్ర నిరాశతో వున్నారని సమాచారం!

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు తన ఆవేదనను ఏకంగా రాజమౌళితో పంచుకున్నాడు. ‘‘ప్రస్తుతం జూనియర్ కెరీర్ బాగులేదు కాబట్టి.. అతని గురించి మళ్లీ ఒకసారి ఆలోచించవచ్చుకదా!’’ అంటూ ఓ అభిమాని రాజమౌళికి ట్వీట్ చేశాడు. అది చూసిన జక్కన్న ఆ ట్వీట్ కు స్పందిస్తూ.. ‘‘సీనియర్ ఎన్టీఆర్ నుంచి అక్కినేని, కృష్ణ, చిరంజీవి లాంటి మెగా హీరోలకు కూడా ఒకానొక సమయంలో ఇటువంటి పరాజయాల పరిస్థితి వచ్చింది. కానీ తర్వాత వాళ్లు తమ సత్తా నిరూపించుకున్నారు. అలాగే జూనియర్ కూడా తన సత్తాను చూపే రోజులు అతి త్వరలోనే రానున్నాయి’’ అంటూ ట్విస్టింగ్ పోస్ట్ చేశాడు జక్కన్న!

రాజమౌళి ఆ విధంగా స్పందించడంతో త్వరలోనే వాళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రావచ్చుననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో కలిసి పనిచేస్తాడా..? లేక అభిమానులను ఓదార్చడానికే ఇలా చెప్పాడా..? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ కు హ్యాట్రిక్ విజయాలను అందించిన రాజమౌళి.. ప్రస్తుతం అతనిని పరాజయాల నుంచి గట్టెక్కిస్తాడా..? లేదా..? అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. వాళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా రావాలని జూనియర్ అభిమానులు కోరుకుంటున్నారు. అభిమాని చేసిన ట్వీట్ కి సూటిగా జవాబివ్వకుండా ట్విస్ట్ ఇచ్చిన జక్కన్న.. అతనితో సినిమా చేస్తాడా..? లేదా..? అభిమానుల కోరికను తీరుస్తాడా..? లేదా..? అనేది తెల్సుకోవాలంటే ‘బాహుబలి’ షూటింగ్ అయిపోయేంతవరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rajamouli  junior ntr  tollywood  telugu fans  telugu news  

Other Articles