Akkineni akhil signs for pepsico brand ambassador

akkineni akhil pepsico ad, akkineni akhil pepsico brand ambassador, akkineni akhil in mountain dew ad, akkineni akhil in titan ad, akkineni akhil first movie latest updates, akkineni akhil vv vinayak movie updates, naga chaitanya next movie, tollywood latest news updates

akkineni akhil signs for pepsico brand ambassador : Pepsico has signed Akhil as the brand ambassador for their cola brand. Shooting of akhil commercial for pepsico has already been completed, will aired soon.

సినిమాల్లో హీరోగా నటించే ఆలోచన లేదేమో...?

Posted: 11/14/2014 10:23 AM IST
Akkineni akhil signs for pepsico brand ambassador

అక్కినేని నట వారసుడిగా అఖిల్ తెరంగేట్రం గురించి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువ హీరోను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఆశగా వెయిట్ చేస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం సినిమాలు చేయకుండా.., మిగతావన్నీ చేస్తున్నారు. అంటే సినిమాలతో పాటు హీరోలు ఎక్కువగా పాల్గొనే కమర్షియల్స్ ప్రకటనలు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించటం వంటివి చేస్తున్నాడు. అఖికి ఉన్న క్రేజ్ తో ఇండస్ర్టీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.., ప్రముఖ గడియారాల తయారీ సంస్థ టైటాన్ ఓ యాడ్ చేసింది. ఇది బాగా పాపులర్ కూడా అయింది. అంతేకాదు హీరో కాకముందే ఇలా ప్రకటనలు చేస్తే.., ఇక సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు.

అనుకున్నట్లుగానే జరిగింది. అఖిల్ తాజాగా మరో యాడ్ లో నటించాడు. కూల్ డ్రింక్స్ తయారీ సంస్థ పెప్సికో తమ కంపనీ బ్రాండ్ అంబాసిడర్ గా అఖిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వీరి ఉత్పత్తుల్లో ఒకటైన ‘మౌంట్ అండ్ డ్యూ’కి అఖిల్ తో యాడ్ షూట్ కూడా అయిపోయిందట. త్వరలోనే దీన్ని టీవీల్లో ప్రసారం చేయనున్నారు. ప్రకటనలు చేసుకోవటాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. అయితే సినిమాల్లోకి వస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఇలా యాడ్స్ చేసుకుంటూపోతేనే.., అఖిల్ కు హీరో అయ్యే ఆలోచన లేదా అని విమర్శకుల నుంచి ప్రశ్నలు ఎదురు కావచ్చు.

ఇక తొలి సినిమా కోసం బాగా బాడీ బిల్డప్ చేసే పనిలో అఖిల్ ఉన్నాడు. డైరెక్టర్ సలహా మేరకు కండలు పెంచేందుకు జిమ్ లో కసరత్తు చేస్తున్నాడు. అఖిల్ తొలి సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.., హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. షూటింగ్ ప్రారంభం అయ్యే లోపు యాడ్లు చేసుకుంటూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  titan  pepsico  latest news  vv vinayak  tollywood  

Other Articles