Sudheer varma clarification on naga chaitanya movie title

naga chaitanya next movie, naga chaitanya latest movie title, naga chaitanya sudheer varma movie title, naga chaitanya latest photos, stills, kriti sanon with naga chaitanya, kriti sanon latest hot photos, tollywood latest updates, dorakadu mayagadu latest updates

sudheer varma clarification on naga chaitanya movie title : Sudheer himself clarified that Dorakadu is not the title of naga chaitanya latest film.

చైతుకి ఇంకా దొరకటం లేదు

Posted: 11/13/2014 11:29 AM IST
Sudheer varma clarification on naga chaitanya movie title

అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ విషయంలో వచ్చిన ఊహాగానాలను డైరెక్టర్ సుధీర్ వర్మ తోసిపుచ్చారు. ఇప్పటివరకు మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు అని చెప్పాడు. ఈ మూవీకి ‘మాయగాడు’, ‘దొరకడు’ అనే టైటిల్స్ లో ఏదో ఒకటి సెలక్ట్ చేస్తారని ఫిలింనగర్ లో గాసిప్స్ విన్పించాయి. ఈ నేపథ్యంలోనే సుధీర్ స్పందించి వివరణ ఇవ్వటతో పేర్లపై పుకార్లు గాలి వార్తలే అని స్పష్టం అవుతోంది. అంతేకాకుండా టైటిల్ పెడితే మీడియాకు వెల్లడిస్తామని సుధీర్ చెప్పాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వస్తున్న చైతు కొత్త సినిమాను ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుందని సమాచారం వస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. బహుశా సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. కుదిరితే డిసెంబర్ చివర్లోనే 2014 సంవత్సర మూవీగా విడుదల కావచ్చు.

తాజాగా విడుదలైన ‘ఒక లైలా కోసం’ మూవీకి హిట్ టాక్ వచ్చింది. దీంతో మళ్లీ ఎంటర్ టైన్ మెంట్, లవ్ స్టోరీ కధలయితేనే చైతుకు సెట్ అవుతాయి పలువురు సలహా ఇచ్చారు. అయితే ప్రస్తుతం చేస్తోంది మాత్రం క్రైమ్ ఎంటర్ టైనర్. మరి ఈ మూవీ ఎలా ఉంటుందనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  dorakadu sudheer varma  tollywood  latest updates  

Other Articles