Mahesh babu koratala shiva movie pune schedule update

mahesh babu koratala shiva movie, mahesh koratala shiva latest update news, mahesh babu sruti hassan latest news, mahesh sruti latest photos, tollywood latest news, mahesh pune shooting photos, sruti hassan latest photos

mahesh babu koratala shiva movie pune schedule update : tollywood super star mahesh babu doing movie with koratala shiva now shooting going progress in pune. mahesh babu breaks sentiment and acted for first shot of movie on him

సెంటిమెంట్ మారింది.. మరి ఫేట్ సంగతి.?

Posted: 11/12/2014 01:52 PM IST
Mahesh babu koratala shiva movie pune schedule update

సెంటిమెంట్ ఆయింట్ మెంట్ లాంటిదని గతంలో చెప్పుకున్నాం. అయితే అది వర్కవుట్ కాకపోతే వదిలేస్తారు అని మహేష్ ను చూస్తే తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ కొరటాల శివతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పూణేలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మహేష్ కు ఓ సెంటిమెంట్ ఉంది. అదేమంటే సినిమాలో ముహూర్తం షాట్ తనపై లేకుండా చూసుకుంటాడు. గతంలో అందరు డైరెక్టర్లకు ఇదే చెప్పటం జరిగింది. అందుకు డైరెక్టర్లు కూడా సహకరించి ఇతర యాక్టర్లతో సన్నివేశాలు షూట్ చేస్తారు.

అయితే కొరటాల సినిమాకు ఈ సెంటిమెంట్ ను మహేష్ బ్రేక్ చేశాడు. తొలి షాట్ ను మహేష్ పై శివ షూట్ చేశాడు. ఈ పెను మార్పుకు కారణం ఏమిటా అని ఆరా తీస్తే.., ఈ మద్య వస్తున్న తన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావటమే అని అంటున్నారు. వరుస ఫెయిల్యూర్స్ నేపథ్యంలో సెంటిమెంట్ మార్చేశాడు. మరి ఈ మార్పుకు తగ్గట్లు ఫలితం కూడా మారిపోతుందో... లేదో సినిమా విడుదల అయితే తెలుస్తోంది. దీనికి వచ్చే ఏడాది వరకు ఆగక తప్పదు.

ప్రస్తుతం పూణేలో జరుగుతున్న షూటింగ్ లో మహేష్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటున్నారు. ఐటి కంపనీల మద్యలో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక మహేష్ పూణే వచ్చాడని తెలుసుకున్న అక్కడి తెలుగు అభిమానులు ఆయన్ను చూసేందుకు షూటింగ్ స్పాట్ కు వస్తున్నారు. అందులోనూ అమ్మాయిలు అయితే మరీ ఎక్కువగా వస్తున్నారని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అదీ మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ . అంటే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  sruti hassan  koratala shiva  latest news  

Other Articles