Allu arjun trivikram combination latest untitled movie unit members denies the rumours pranitha trivikram clashes

allu arjun, trivikram srinivas, allu arjun latest news, allu arjun trivikram srinivas movie, actress pranitha, samantha, adah sharma, pranitha hot photos, adah sharma hot photos, samantha hot photos, allu arjun trivikram movie unit members, tollywood news, tollywood gossips

allu arjun trivikram combination latest untitled movie unit members denies the rumours pranitha trivikram clashes

సినిమాలోలేని నటిపై ఎలా కోప్పడతారు..?

Posted: 11/05/2014 11:33 AM IST
Allu arjun trivikram combination latest untitled movie unit members denies the rumours pranitha trivikram clashes

అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటివరకు లెక్కలేనన్ని పుకార్లు వచ్చాయి. హీరోయిన్ల విషయంలోగానీ, ఇతర తారాగణ విషయంలోగానీ ఇప్పటికీ రకరకాల గాసిప్స్ వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ప్రణీతకు సంబంధించి ఓ రూమర్ బాగానే హల్ చల్ చేసింది. ఒకనాడు చిత్రషూటింగ్ లో పాత్రకు తగ్గట్టుగా మేకప్ చేసుకోలేదంటూ నటి ప్రీణతను దర్శకుడు త్రివిక్రమ్ గట్టిగా అరిచారనీ.. దాంతో ఆమె ఆ చిత్రం నుంచి పక్కకు తప్పుకుందన్న వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! అయితే ఈ విషయమై తాజాగా ఆ మూవీ యూనిట్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

‘‘సినిమాలో ఒక పాత్రకోసం ప్రణీతను అనుకోవడంగానీ, సంప్రదించడంగానీ అస్సలు జరగనే లేదు. ఇంతవరకు ఆమెను సంప్రదించలేదు కూడా! అలాంటిది.. సినిమాలోనే లేని నటిని షూటింగ్ స్పాట్ లో డైరెక్టర్ ఎలా కోప్పడతారు?’’ అని చిత్రయూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. వాస్తవానికి ఇప్పటిదాకా ఈ చిత్రం కేవలం 15 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. అందులో హీరో అల్లు అర్జున్, సమంత, అదాశర్మ, రాజేంద్రప్రసాద్, రావురమేష్ బృందం మాత్రమే పాల్గొంది. అదీ కూడా హైదరాబాద్ పరిసరాల్లో మాత్రమే షూటింగ్ జరిగింది. అంతేగానీ ప్రణీత ఈ సినిమాలు అస్సలు లేనేలేదని యూనిట్ బృందం తెలుపుతోంది. దర్శకుడు ప్రణీతపై కోప్పడటం, ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోవడం వార్త తమకు ఆశ్చర్యానికి గురి చేసిదని వాళ్లు పేర్కొంటున్నారు.

అలాగే ఈ సినిమాలో అల్లుఅర్జున్ తండ్రిగా అమితాబ్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి వారిని సంప్రదిస్తున్నట్లు అనధికారిక పుకార్లు వస్తున్నాయి. దీనిపై చిత్రవర్గాలు మాట్లాడుతూ.. ‘‘గతంలో కూడా జులాయి చిత్రానికి సంబంధించి ఇలాగే చాలాపుకార్లు వచ్చాయి. సాధారణంగా ప్రతిఒక్క సినిమాకు సంబంధించి రూమర్స్ వస్తూనే వుంటాయి. ప్రస్తుతం కూడా అలాగే జరుగుతోంది. అయితే ఆ వదంతులను అస్సలు నమ్మకండి. ఈ సినిమా టైటిల్, ముఖ్యతారాగణం, ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం’’ అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  trivikram srinivas  pranitha  samantha  adah sharma  

Other Articles