Allari naresh on his marriage and 50th movie

allari naresh next movie, allari naresh latest comments, allari naresh on marriage, allari naresh 50th movie, allari naresh brother of bommali movie, brother of bommali movie release date, tollywood latest updates

allari naresh on his marriage and 50th movie : allari naresh responds on his marriage, in a media site interview he says not interested to marry soon because have no time to spend with wife by busy schedules

పెళ్లి చేసుకుని ఏం చేయాలి? నాకెలాగూ...

Posted: 11/04/2014 06:19 PM IST
Allari naresh on his marriage and 50th movie

పెళ్లి అంటే అమ్మాయిలు సిగ్గుపడతారు.. అబ్బాయిలు ఆలోచనలో పడతారు. కానీ అల్లరి నరేష్ మాత్రం ఈ రెండిటికీ విరుద్దంగా ఆసక్తి లేదు అంటున్నాడు. అయితే పూర్తిగా కాదు లెండి.. ఇప్పట్లో మాత్రం పెళ్ళి అనే టాపిక్ గురించి ఆలోచించటం లేదన్నారు. తన తాజా సినిమా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ గురించి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో నరేష్ ఈ కామెంట్ చేశాడు. ‘ఇప్పుడు నేను సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. పెళ్ళి అయితే అమ్మాయితో ఎప్పుడు ఉంటాను?. ఇప్పటికిప్పుడు పెళ్ళి అయితే అమ్మాయి పుట్టింటి నుంచి మా ఇంటికి వచ్చి ఉంటుంది అంతే అన్నారు.

సినిమాల బిజీలో పడి ఇప్పటికే తన పర్సనల్ లైఫ్ కాస్త దూరం అవుతోందన్నారు. నాకు ఎలాగూ వ్యక్తిగత జీవితం ఎంజాయ్ చేసేంత టైం లేదు. వచ్చే అమ్మాయిని కూడా అలాగే చేస్తే బాగుండదు కదా అంటున్నాడు. మరి ఎప్పుడు చేసుకుంటావు అని సూటిగా అడిగితే... ఇప్పుడైతే కాదు అని షార్ట్ గా సమాధానం చెప్పాడు. ఇక ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తనతో పాటు కార్తిక కూడా హీరోలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిందన్నారు. సినిమా చూస్తే ఇలాంటి సిస్టర్స్ కూడా ఉంటారా అనుకుంటారు అని చెప్పారు.

కార్తీక చేసిన ఫైట్స్, డాన్స్, డైలాగ్స్ హైలైట్ అవుతాయని చెప్తున్నాడు. ముఖ్యంగా డాన్స్ అయితే చాలా బాగా చేసిందని కితాబిచ్చాడు. తాను అనుకున్న కాన్సెప్ట్ కు డైరెక్టర్ చిన్ని పూర్తి న్యాయం చేశాడని చెప్పారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కూడా మంచి ట్యూన్స్ అందించాడని చెప్పాడు. గత ఫెయిల్యూర్స్ నేపథ్యంలో ఈ సారి జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాను. ఎవరిని నిరాశపర్చకుండా అందరికి కామెడి అందించేలా జాగ్రత్తలు తీసుకున్నాము. కాబట్టి సినిమా హిట్ అవుతుందని అల్లరి నరేష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈనెల 7న ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ భవితవ్యం తేలిపోనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  brother of bommali  marriage  latest news  

Other Articles