I movie telugu rights creates new record before releasing audio in telugu

i movie, i movie telugu, telugu i movie teaser, i movie telugu trailer, i movie news, i movie photos, director shankar news, director shankar movies, amy jackson news, rajnikanth robo movie, robot telugu movie, rajni robo movie, enthiran movie news, i movie news, amy jackson bikini photos

i movie telugu rights creates new record before releasing audio in telugu

రోబో రికార్డులను బద్దలు కొట్టేసిన ‘‘ఐ’’!

Posted: 10/28/2014 04:02 PM IST
I movie telugu rights creates new record before releasing audio in telugu

భారీ సైంటిఫిక్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న శంకర్ దర్శకత్వంలో మరో సంచలన చిత్రం ‘‘ఐ’’ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఆడియో విడుదల ఇటీవలే చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఆ వేడుకలో రజనీకాంత్, ఆర్నాల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం విదితమే! అంతకుముందు వరకు ఈ సినిమా గురించి అందరూ అంతగా పట్టించుకోలేదుగానీ.. టీజర్ రిలీజ్ అయిన అనంతరం మాత్రం ఈ చిత్రం విడుదలకోసం ప్రతిఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సౌత్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ మూవీ సాధించని యూట్యూబ్ వ్యూస్ ఈ చిత్రం టీజర్ కి దక్కాయంటే.. ఈ మూవీ డిమాండ్ ఏ మేరకు వుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మేటర్ లోకి వస్తే.. నిన్నమొన్నటివరకు ‘‘ఐ’’ మూవీ తెలుగు హక్కులను కొనుగోలు చేసేందుకు మొహం చాటేసిన టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు.. ఆ మూవీ టీజర్ యూట్యూబ్ లో సృష్టించిన ప్రభంజనాన్ని చూసి ఇప్పుడు హక్కులు కొనేందుకు ఎగబడుతున్నారని సమాచారం! అప్పట్లో విడుదలైన రజనీకాంత్ ‘‘రోబో’’ హక్కులు మాత్రమే అత్యధికంగా 27 కోట్లకు అమ్ముడుపోయాయి. డబ్బింగ్ చిత్రాల్లో ఇప్పటివరకు ‘‘రోబో’’ ఒక్కటే రికార్డు ధర! అయితే ఆ రికార్డును ‘‘ఐ’’ చిత్రం సునాయాసంగా క్రాష్ చేస్తుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే 'ఐ' నైజాం హక్కులను 10 కోట్లకు, వైజాగ్ ఏరియా హక్కులు 5 కోట్లకు, ఉభయ గోదావరి జిల్లాల హక్కులు 2.5 కోట్లకు పంపిణీదారులు కొనుగోలు చేశారని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మిగతా ఏరియాల నుంచి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ మొత్తాన్ని డబ్బింగ్ హక్కులకు ఆఫర్ చేస్తూ ఈ మూవీ నిర్మాత రవిచంద్రన్ ను సంప్రదిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మిగతా ఏరియాల బిజినెస్ కూడా పూర్తయితే దాదాపు 30 కోట్ల బిజినెస్ ను రెండు తెలుగురాష్ట్రాల్లో విడుదలకు ముందే చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తెలుగులో ఆడియో రిలీజ్ కాకముందే ఈ మూవీ రెండు తెలుగురాష్ట్రాల్లో ‘‘ఐ’’ మూవీ బిజినెస్ పూర్తిగా క్లోజ్ అవుతుందని.. ‘‘రోబో’’ రికార్డు బద్దలు కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే కలెక్షన్లపరంగా 40 కోట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  rajnikanth robo movie  amy jackson  director shankar news  chiyan vikram  

Other Articles