I movie to release in january

vikram, vikram movies, vikram latest updates, hero vikram, vikram i movie, vikram i movie stills, vikram latest images, vikram movies, vikram i movie release date, i movie release date, i movie trailor, i movie trailer, i movie teaser, i movie songs free download, shankar, shankar i movie, director shankar, shankar i movie release, i movie images, i movie shooting stills, pawan kalyan, pawan kalyan movies, pawan kalyan gossips, pawan kalyan latest updates, pawan kalyan wiki, pawan kalyan marriages, pawan kalyan gopala gopala movie, pawan kalyan latest movies, pawan kalyan fans, pawanism, tollywood updatest, koliwood latest updates, latest movie gossips, latest news

vikram new movie i to release in january and it will give compitation to pawan kalyan latest movie gopala gopala : in sankranthi season pawan will have tough compitation with shankar latest i movie

పవన్ సినిమాపై తమిళుల కన్ను

Posted: 10/10/2014 11:49 AM IST
I movie to release in january

టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో ఇండియాలోనే ఇప్పుడు పాపులర్ యాక్టర్ అంటే అంతా చెప్పేది పవన్ కళ్యాణ్ పేరు. అలాంటి పవన్ కు ఇధ్దరు తమిళ ప్రముఖులు తమకు తెలియకుండానే సవాల్ విసురుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా జరుగుతోంది. శంకర్ డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ విజువల్ వండర్ ‘ఐ’ సినిమా విడుదల ఇప్పట్లో లేదు అని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాను దీపావళి వరకు విడుదల చేయాలని శంకర్ కసితో ఉన్నా... అది అసాధ్యం అని కోలీవుడ్ ప్రముఖులు కోడై కూశారు. ఇప్పుడదే నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విడదల దీపావళికి లేదు అన్పిస్తోంది.

ముందుగా చెప్పిన ప్రకారం మరో రెండు వారాల్లో సినిమా విడుదల కావాలి. కాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీనికి తోడు విక్రమ్ ప్రస్తుతం హిందీ వర్షన్ కు డబ్బింగ్ చెప్తున్నాడు. ఇంకా పలు భాషల్లో ఈ సినిమాను డబ్ చేయాల్సి ఉంది. దీనికి తోడు పలు ప్రపంచ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో వాటికీ గొంతునివ్వాల్సి ఉంది. ఇదంతా జరిగేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ నెల మధ్యలో పనులు పూర్తవుతాయన్నమాట.

ఆ తర్వాత ఇంకా ఏమైనా చిన్నా చితకా ఎడిటింగ్ పనులు, అదనపు ఆకర్షణలు ఉంటే సరిచూసుకుని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు కారణం మాత్రం ఇది కాదు అని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో రజిని తాజా సినిమా ‘లింగా’ వస్తుంది అందు వల్ల ఈ సినిమాను కొద్దిరోజులు ఆగి అంటే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతిని ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగానే తమిళనాడులో కూడా పొంగల్ పేరుతో ఘనంగా జరుపుకుంటారు. అందువల్ల అంతా ఒక్కచోట చేరే ఈ పండగకు సినిమాను విడుదల చేయాలని శంకర్ డిసైడ్ అయినట్లు సన్నిహితులు చెప్తున్నారు.

అయితే ఇక్కడే టాలీవుడ్ లో ఓ చిక్కు వచ్చింది. అదేమంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ ను నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ లో పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు షెడ్యూల్ ప్రిపేర్ చేసి బాగానే కష్టపడుతున్నారు. సంక్రాంతి రేసులో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి లేకపోవటంతో ఈ మల్టీ స్టారర్ సినిమాదే హవా అనుకున్నారంతా. కాని ఇప్పుడు దీనిపై ‘ఐ’ కన్ను పడింది. తమిళంలో రూపొంది తెలుగులోకి డబ్ అయిన ‘ఐ’ మనోహరుడు కూడా గోపాలుడితో పాటు సంక్రాంతికి థియేటర్లకు వస్తున్నాడు. దీంతో ఎలాంటి పోటి లేదు అనుకుంటున్న ఫ్యాన్స్ కు శంకర్, విక్రమ్ కలిసి తమ సినిమాతో రేసును మొదలు పెట్టారు. అటు పవన్-వెంకీ మల్టీ స్టారర్ సినిమా ఇటు శంకర్ క్రియేషన్ వండర్ కావటంతో సంక్రాంతి పండగకు పోటి గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15వేల థియేటర్లలో విడుదల అవుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  i movie  vikram  pawan kalyan  shankar  

Other Articles