Samantha scolds director with her self

samantha, samantha wiki, samantha hot, samantha latest, samantha marriage, samantha love, samantha affair, samantha movies, samantha latest movies, samantha latest news, movies, tamil movies, tollywood latest updates, koliwood latest, bollywood latest updates, hollywood latest updates, directors, movie directors, rascal, rascal meaning

telugu popular heroine samantha scolds a tamil movie director with herself during shooting time : a tamil director asks samantha to act for a scene repeatedly for more than half an hour, with this she got angry and scolded the dirctor by saying rascal in her self

మరి మొన్న ఎందుకు అలా అయింది..?

Posted: 10/09/2014 11:03 AM IST
Samantha scolds director with her self

చెన్నై చిన్నది సమంత వయ్యారాల గురించి అందరికి తెలిసిందే. అమ్మడు ఏడిస్తే ఆ సినిమాలు ఎంతో హిట్ అవుతాయన్న పేరు ఉంది. కాని నిజజీవితంలో ఎవరైనా ఏడిపిస్తే మాత్రం వారిని అంతగా పట్టించుకోదట. మరీ ఎక్కువగా ఇబ్బంది పెడితే మనసులో తిట్టేసుకుంటానని చెప్తోంది. ఇలాగే మొన్నామద్య ఓ డైరెక్టరు.. అంటూ చిన్న కధ చెప్పింది అదేమిటో చూద్దాం. సినిమాలో ఒక సీన్ కోసం ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. సెకన్ల పాటు ఉండే సీన్లు తీయటానికి టేకుల మీద టేకులు తీసుకుంటారు. షూటింగ్ చూసే వారికి ఇది బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక నటులకు అయితే ఇదో సహనపరీక్ష. ఎంత కోపం వచ్చినా.., ఇబ్బంది అన్పించినా సీను పండే వరకు యాక్షన్ అనగానే నవరసాలు ఒలికించాల్సిందే.

ఇలాగే మన సమ్మును కూడా ఓ డైరెక్టర్ తెగ ఇబ్బంది పెట్టాడట. ఓ సీన్ కోసం అరగంట పాటు రెడి.., టేక్..., యాక్షన్ అంటూ తెగ సీన్ క్రియేట్ చేశాడట. దీంతో ముక్కు చెక్కించుకున్న మద్దుగుమ్మకు తెగ కోపం వచ్చేసింది. అయితే డైరెక్టర్ కావటంతో తిట్టలేకపోయింది. దీంతో మనసులోనే రాస్కెల్.., అంటూ తిట్లపురాణం అందుకుని ఓ నాలుగు తిట్లు తిట్టేసుకుని  కోపం చల్లబర్చుకుంది. చివరకు యాక్షన్ అనగానే సీన్ అయితే చేసిందనుకోండి. అలా తనకు కోపం వచ్చినా లోపల తిట్టుకుంటాను తప్ప బయటకు ఏమి అనను అని చెప్తోంది.

అయితే కొద్దిరోజుల క్రితం మీడియాపై మండిపడ్డ సమంతి అని వార్త వినే ఉంటారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత అక్కడే ఉన్న తమిళ మీడియా దగ్గరకు వచ్చి మరీ.., ఎడాపెడా తిట్టి పారేసింది. చెప్పాలనుకుంది కోపంగా చెప్పేసి వెళ్లిపోయింది. ఇప్పుడేమో ‘రేసుగుర్రం’లో స్పందనలాగా అంతా లోపలే అని వయ్యారాలు పలుకుతోంది. ఇదే నిజం అయితే మొన్న జరిగిందేమిటమ్మా...? అని ప్రశ్నలు వస్తున్నాయి. బహుశా.., మీడియాను తిట్టింది నేను కాదు.., నా లోపలి సమంత అని అంటుందేమో విడ్డూరంగా. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. అయితే సమత మాత్రం ఇంట గెలవకపోయినా.., బయట మాత్రం బాగానే పాపులర్ అయింది. అదేనండి చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తమిళ పరిశ్రమకు అంతగా అబ్బలేదు కాని తెలుగులో మాత్రం తెగ బిజీ హీరోయిన్ అయిపోయింది. తమిళంలో సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం ‘కత్తి’ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా హిట్ అయితేనే పుట్టింట్లో భవిష్యత్తు లేకపోతే.., పొరుగింటి పుల్లకూరే రుచి అనుకోక తప్పదు మరి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  director  koliwood  rascal  latest news  

Other Articles