Gopichand next movie with yuvi creations

gopichand, gopichand wiki, gopichand photos, gopichand latest, gopichand marriage, gopichand movies, gopichand loukyam, gopichand upcoming movies, loukyam movie songs free download, loukyam songs, loukyam review, loukyam rating, loukyam latest updatest, tollywood, yuvi creations, latest news

hero gopichand next movie in the banner of yuvi creations it will release in january : gopichand next movie with new director and new music director may release in sankranthi season

పండగ కోసం కొత్తవారిని పట్టుకున్నాడు

Posted: 09/27/2014 01:55 PM IST
Gopichand next movie with yuvi creations

‘లౌక్యం’ సినిమాకు మంచి టాక్ రావటంతో హీరో గోపిచంద్ జోష్ మీద ఉన్నాడు. మరో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ ధఫా ఇద్దరు కొత్త వ్యక్తులను ఇండస్ర్టికి పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ గోపిచంద్ కొత్త సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇదే సినిమా ద్వారా సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ర్టీకి పరిచయం అవుతున్నాడు. క్రేజి సినిమాలకు కేరాఫ్ గా మారిన యువి ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది.

‘మిర్చ’, ‘రన్ రాజా రన్’ సినిమాలతో మంచి పేరు తచ్చుకున్న యువి ప్రొడక్షన్స్ కు ఇది మూడవ సినిమా ఈ నేపథ్యంగా ‘ప్రొడక్షన్ నెం.3’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపిచంద్ ను హీరోయిజం క్యారెక్టర్లొ చూపిస్తారని ఫొటో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఇంకా ఈ సినిమాకు మాత్రం పేరు పెట్టలేదు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టగా త్వరలోనే వేగం పెంచుతారని తెలుస్తోంది.

శుక్రవారం విడుదల అయిన గోపిచంద్ సినిమా ‘లౌక్యం’కు మంచి స్పందన వచ్చింది. సినిమా కామెడి, ఎంటర్ టైనింగ్ గా ఉందని టాక్ వస్తోంది. దీంతో ఇదే తరహాలో కామెడి, యాక్షన్ సినిమాను చిత్రీకరిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ‘లౌక్యం’ హిట్ తో మంచి ఊపుమీద ఉన్న గోపి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. దీంతో త్వరలోనే మరిన్ని సినిమాలు సైన్ చేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. పెళ్ళి తర్వాత గోపి సినిమా లైఫ్ బాగుంది అన్నమాట.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand  loukyam  yuvi creations  latest news  

Other Articles