Tejaswini to act in omkar movie

omkar, omkar anchor, omkar shows, omkar spoofs, omkar latest, show host omkar, aata dance show, latest news, tv shows, telugu tv channels, telugu latest, telugu tv shows, tejaswini, tejaswini hot, tejaswini wiki, tejaswini latest, tejaswini ice cream movie, tejaswini caste, tollywood, film news

ice cream movie heroine tejaswini to act in tv anchor omkar producing movie hero is omkar's brother : tejaswini to act in omkar's movie with name of raju gari gadhi a comedy and action movie

రాజుగారి గదికెళ్లిన వర్మ పాప

Posted: 09/25/2014 05:57 PM IST
Tejaswini to act in omkar movie

ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించిన తేజస్విని ఇప్పుడు రాజు గారి గదికి వెళ్లేందుకు సిద్ధమయింది. టీవీ షోలు చేసే ఓంకార్ డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా పేరు ‘రాజుగారి గది’ ఈ సినిమాలో హీరోయిన్ గా తేజును తీసుకున్నారట. ఓంకార్ బ్రదర్ అశ్విన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సినిమా స్క్రిప్టును సిద్ధంగా ఉంచుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఫిలింగనర్ వర్గాలు అంటున్నాయి. సాధారణంగానే తన మాటలతో షోలోని వారిని భయపెట్టే ఓంకార్.. ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టాలని భావిస్తున్నాడట. అంతేకాకుండా ఇప్పుడంతా యాక్షన్, హర్రర్ సినిమాల హవా నడుస్తుందని భావించి తనుకూడా అదే విధంగా సినిమాలు తీయాలని భావిస్తున్నాడు.

అందుకోసమే అశ్విన్-తేజశ్వినితో ‘రాజుగారి గది’ సినిమాను చేస్తున్నాడు. ఇది పూర్తిగా కామెడి, యాక్షన్ తో ఉంటుందని ఓంకార్ సన్నిహితులు చెప్తున్నారు. ఆ మద్య వచ్చిన ‘జీనియస్’ సినిమా దెబ్బయిపోవటంతో.., కోలుకోవటానికి కాస్త గ్యాప్ తీసుకుని.., మళ్ళీ ఓ గదిలో సినిమాను మొదలు పెట్టాడు. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెడతాడట తెలిసివచ్చినట్లుంది పాపం. ఈ సినిమా అటు ఓంకార్ కు ఇటు తేజుకు ఓ అవకాశంలా భావించవచ్చు. ఐస్ క్రీం సినిమాలో భయపడటమే కాకుండా బాత్ రూంలో నగ్నంగా నిలబడినట్లు టాక్ తెచ్చుకుని ఫేమస్ అయింది తేజు. అయితే ఆ తర్వాత ఆమెకు ఆఫర్ రాలేదు.

ఈ సినిమాపై మాట్లాడిన తేజశ్విని ‘‘ ఐస్ క్రీం సినిమా కంటే ముందే ఓ సినిమాలొ చేశాను. ఓంకార్ బ్రదర్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఊర్వశివో రాక్షసివో’ అనే పేరు పెట్టే అవకాశముందని చెప్పింది. ఇక తమిళంలో కూడా మరో సినిమా చేస్తుందట. అక్కడ కూడా భయపడే సినిమానా.. లేక అందంతో ఆకట్టుకునేదా మాత్రం చెప్పలేదు. అంతదూరం ఎందుకు లెండి.., ఇఫ్పుడు ‘రాజుగారి గది’లో ఏముంది.. తేజు ఎందుకు వెళ్లిందో దాని గురించి ఆలోచిద్దాం.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tejaswini  omkar  latest news  tollywood  

Other Articles