Bandla ganesh comments on chiranjeevi

govindudu andarivadele audio, govindudu andarivadele, govindudu andarivadele audio songs free download, govindudu andarivadele audio release, govindudu andarivadele audio release photos, govindudu andarivadele release date, govindudu andarivadele ramcharan tej, chirajneevi, chiranjeevi comments, bandla ganesh, bandla ganesh comments on chiranjeevi, bandla ganesh comments on pawan kalyan, tollywood, latest news

telugu film producer bandla ganesh again given sensational comments now he commented on chiranjeevi : bandla ganesh praised chiranjeevi by saying pawankalyan is god for ganesh and chiru is god for pawan

మళ్ళీ కంట్రోల్ తప్పిన గణేష్ !

Posted: 09/16/2014 12:38 PM IST
Bandla ganesh comments on chiranjeevi

బండ్ల గణేష్ ఆర్టిస్టు స్థాయి నుంచి బిగ్ నిర్మాతగా ఎదిగిన వ్యక్తిగా అందరికి తెలుసు. ఇంత పేరు తెచ్చుకున్న గణేషుడికి ఓ వీక్ పాయింట్ ఉంది. అదే కంట్రోల్ తప్పటం. స్టేజి ఎక్కాడంటే..,. మైక్ పట్టుకున్నాడంటే ఏం మాట్లాడతాడో ఎవరూ ఊహించలేరు. గాంధీ, దేవుడు, స్టాలిన్, చెగువేరా వీరంతా బండ్లకు అప్పుడే హీరో ముఖంలో ప్రత్యక్షం అవుతారు. ఇక పూనకం వచ్చినట్లుగా వారిని వర్ణిస్తూ.. హీరోలను బరువెక్కిస్తాడు. ఈ కామెంట్లు కాంప్లిమెంట్లే అయినా తీసుకునేందుకు ఎవరూ సాహసించరు అలా ఉంటాయి మరి ఆ మాటలు. తాజాగా రామ్ చరణ్ ‘ గోవిందుడు అందరివాడేలే’ ఆడియో విడుదల సందర్బంగా కూడా గణేష్ కంట్రోల్ తప్పాడు.

దేవుడికే దేవుడు

గతంలో ‘గబ్బర్ సింగ్’  వేడుకల సందర్బంగా పవన్ కళ్యాణ్ దేవుడు, ఆయనలో మహాత్ముడు కన్పిస్తాడని పొగడ్తలతో పవన్ కే కడుపబ్బేలా నవ్వు తెప్పించిన గణేష్., సోమవారం సాయంత్రం మరోసారి రెచ్చిపోయాడు. దేవుడికే దేవుడు దొరికాడంటూ కామెంట్ చేశాడు. అదేనండీ తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే ఆయనకు చిరంజీవి దేవుడు అని కితాబిచ్చారు. చిరు సింప్లిసిటీ చూస్తే తనకు ఎంతో ముచ్చటేస్తుందన్నారు. ఇక ఓ భారీ డైలాగ్ కూడా వదిలాడు. ‘‘ క్యారెక్టర్ అంటే క్యారెట్టు కాదు మార్కెట్లో దొరకడానికి., అది బ్లడ్ లో ఉండాలి. అది కొణిదెల వారి బ్లడ్ లో ఫుల్ గా ఉంది’’ అని ఫుల్ కిక్కుతో మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ నినిదాలతో హోరెత్తించారు.

అటు కార్యక్రమంకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి కూడా గణేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ ను నమ్మి ఆయన ఇంత భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారని కీర్తించారు. అంతేకాకుండ సినిమాలో కొన్ని సీన్లు సెట్ కాకుండా ఏం చేయాలా..? అని ఆలోచిస్తుంటే.., ఆ పాత్రల్లో ఉన్న నటులకు పూర్తిగా నటించకుండానే మొత్తం రెమ్యూనరేషన్ చెల్లించి సినిమా నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడని ప్రశంసించారు. సినిమా పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏమైనా చేయిస్తుందని చిరు చెప్పారు. దీంతో గణేష్ సంతోషం పట్టలేకపోయాడు. ఏం చేస్తున్నాడో తెలియకుండా కంట్రోల్ తప్పి కామెంట్లు చేసినట్లు సినీ వర్గాలంటున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  bandla ganesh  chiranjeevi  pawan kalyan  

Other Articles