Swathi on her marriage

swathi, colors swathi, colours swathi, swathi hot, swathi saree, swathi latest photos, tollywood, latest news, film news, old movies, telugu famous characters, color swathi on marriage, heroines marriage

colors swathi condemns her marraige rumors and clarifies that she will not marry in soon days : my dream is to do characters like sita, droupathi and other popular in telugu industry

పెళ్ళిప్పుడే కాదు కానీ.. ఆ కోరిక తీరాలి !

Posted: 09/14/2014 06:10 PM IST
Swathi on her marriage

పెళ్లి అనగానే ఏ అమ్మాయి అయినా వెంటనే సిగ్గుపడుతుంది. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లంటే నాకా.. మీకెవరు చెప్పారు అని వెంటనే ప్రశ్న ఎదురవుతుంది. కలర్ స్వాతి కూడా సరిగ్గా ఇలానే వ్యవహరించింది. ఓ తమిళ హీరోతో ప్రేమాయణం సాగించి.. పెళ్లికి సిద్దమవుతున్నట్లు వచ్చిన వార్తలు తోసిపుచ్చింది. ఇదంతా మీడియా పుకార్ల పుణ్యమే అంటూ కొట్టిపారేసింది.  చెన్నైకి వెళ్తే తమిళ హీరోతో ప్రేమలో పడినట్లేనా అని ప్రశ్నించింది. ఇక తాను నటించిన కార్తికేయ సినిమా త్వరలోనే విడుదలవుతుందని చెప్పింది.

అటు స్వాతి తనకున్న కొన్ని వింత కోరికలను ఈ సందర్బంగా బయటపెట్టింది. సీత, ద్రౌపది వంటి పాత్రలు పోషించాలని తెగ ఆశ ఉందట. మరి ఈ కోరిక ఎవరు మన్నించి అవకాశం ఇస్తారో చూడాలి. టాలీవుడ్ అంతా  గ్లామర్ పాత్రలతో దూసుకెళ్తుంటే ద్రౌపతినై చీరలు కడతానని చెప్తోంది స్వాతి. మరి ఎవరు అవకాశం ఇచ్చే దైర్యం చేస్తారో. రష్యాలో పుట్టినా.., తెలుగు సినిమాపై ఉన్న అభిమానంతో సీరియళ్ళు మొదలుకుని సినిమాల్లో హీరోయిన్ స్థాయికి ఎదిగింది స్వాతి.

మొదట్లో కెరీర్ బాగానే నడిచినా.., గ్లామర్ పాత్రలకు నో చెప్పటంతో కాస్త వెనకబడ్డట్టు తెలుస్తోంది. సినిమాలు రాకపోయినా  సరే అందాల ఆరబోతకు మాత్రం సిద్దం కాను అని చెప్పింది. అయితే సాంప్రదాయ దుస్తులైన చీరలు, ఇతర డ్రస్సులనే స్వాతి కోసం గ్లామర్ గా రూపొందించారు. అయితే అవి అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో సత్యం తెలుసుకుంది స్వాతి. మరి భవిష్యత్తులో ఆమెలోని కలర్స్ అభిమానులకు కన్పిస్తాయో  లేదో.. చూడాలి.
 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swathi  marriage  tollywood  latest news  

Other Articles