Vikram s i movie gif

director shankar, director shankar movies, shankar latest movies, hero vikram, vikram movies, l movie, shankar's i movie, vikram i movie, i movie first look, i movie teaser, tollywood, koliwood, movie news, film news, latest news

director shankar's latest movie l first look released on thursday : vikram shankar's combination movie l first look getting craze in internet after released on thursday

విక్రమ్ ‘ఐ’ ఫస్ట్ లుక్ సెన్సేషన్

Posted: 09/12/2014 08:26 AM IST
Vikram s i movie gif

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఐ’ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గురువారం విడుదలైన ఈ ఫొటోను ఇప్పటికే లక్షల మంది ఫ్యాన్స్ చూశారు. సినిమాలో హీరోగా నటిస్తున్న విక్రమ్ ఫస్ట్ లుక్ లో మంచి బాడి బిల్డింగ్ తో పాటు భయపెట్టే ముఖంతో అదరగొడుతున్నాడు. సినిమా ఓ యాక్షన్ మూవీ అని పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే శంకర్ మరి ఈ సినిమాలో ఏ మంత్రం వేశాడో తెలియాలంటే మాత్రం విడుదల వరకు వేచి చూడాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా సంచలనాలు నమోదు చేసే శంకర్ ఈ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకుంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

KoeRx-UZyFc

అటు ఫస్ట్ లుక్ ఇప్పటికే క్రేజ్ సంపాదించుకోగా ఆడియో విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈనెల 15న ‘ఐ’ ఆడియో విడుదల కానుంది. కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, హాలీవుడ్ నట దిగ్గజం ఆర్నాల్డ్ స్క్వార్జ్ పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా అమీజాక్సన్ నటిస్తోంది. ఇక ఏ.ఆర్. రెహమాన్ శంకర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా ‘మనోహరుడు’ పేరుతో విడుదల కానుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie first look  director shankar  herom vikram  latest news  

Other Articles