Adah sharma tie up with hero aadi in next movie

tollywood hero aadi, telugu galipatam movie, galipatam telugu movie hero aadi, adah sharma latest news, adah sharma hot photos, adah sharma hero aadi, hero aadi adah sharma, director madan

adah sharma tie up with hero aadi in next movie : heart attack movie hot beauty adah sharma tie up with hero aadi in next movie which is directed by madan.

అందాల అదాకు తెగిపడిన గాలిపటం!

Posted: 08/13/2014 03:34 PM IST
Adah sharma tie up with hero aadi in next movie

‘‘హార్ట్ ఎటాక్’’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై, ప్రేక్షకులను తన అందాల వలలో పడేసిన భామ అదాల శర్మ హవా ప్రస్తుతం టాలీవుడ్ లో పూర్తిగా పాకినట్టు కనిపిస్తోంది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించని ఈ అమ్మడు... మొన్న బెంగుళూరులో జరిగిన ఫ్యాషన్ షోలో భాగంగా తన తెల్లతోలు మొత్తం కనిపించేలా నల్లగౌను ధరించి అందరినీ మత్తెక్కించింది. అంతే! అభిమానులతోపాటు సినీ పరిశ్రమలో వున్న ప్రముఖులు కూడా ఈమె అందానికి దాసోహమయిపోయారు. తిరిగి ఈ అమ్మడు మళ్లీ తెరమీదకు ఎప్పుడు కనువిందు చేస్తుందా అని అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నట్టు సమాచారం! దీంతో ఇప్పుడు ఈ అమ్మడు డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా... అదా శర్మ అందాలకు మన టాలీవుడ్ కుర్ర హీరోలు కూడా ఫిదా అయినట్టు తెలుస్తోంది. ఈమెతో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలనే తపనతో వెయిట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఇప్పుడు ఈ అమ్మడికి దొరికిన తాజా అవకాశమేనని వారు వెల్లడిస్తున్నారు. ‘‘గాలిపటం’’ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఆది.. తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా అదా శర్మను తీసుకోవాల్సిందిగా దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకోసం ముందుగా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ప్లాన్ చేసినా.. ఆది సలహామేరకు అదా శర్మయే కరెక్ట్ అని భావించి తుదినిర్ణయానికి వచ్చినట్లు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

‘‘ఆ నలుగురు’’ స్ర్కిప్ట్ రైటర్, ‘‘పెళ్లైన కొత్తలో’’ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు వహించిన మదన్... చాలారోజుల తర్వాత ‘‘గాలిపటం’’తో మంచి విజయాన్ని అందుకున్న ఆదితో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 30మంది కొత్తవారిని ఆడిషన్స్ చేశారు. కానీ అందరూ సరిగ్గా ప్రదర్శించకపోవడంతో ఆందోళనల్లో మునిగిపోయారు. చివరకు హీరోయిన్ కోసం చర్చలు చేయగా.. అదాశర్మను తీసుకుంటే బాగుంటుందని హీరో ఆదితోపాటు దర్శకుడు మదన్, చిత్రయూనిట్ సభ్యులు చివరి నిర్ణయానికి వచ్చేశారు. వీరిద్దరికి సంబంధించిన కొన్ని సన్నివేశాలపై కూడా ఫోటోషూట్ చేశారని సమాచారం!

రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో ఆది యంగ్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు. ‘‘హార్ట్ ఎటాక్’’ తర్వాత తెలుగులో అదా శర్మ చేస్తున్న రెండో సినిమా ఇది. ఒకవైపు అదాశర్మ అందాలకు మంచి మార్కులు పడుతుంటే... ఈ సినిమాతో తెలుగులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని అమ్మడు భావిస్తోందట! ఏదేమైనా.. అందాల అదాకు హీరో ఆది గాలిపటం తెగిపోయిందని ఇండస్ట్రీవర్గాల్లో వార్తలు జోరుగా సాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles