Actress sarita controversial comments on husband actor mukhesh

actress sarita, sarita mukhesh, mukhesh sarita, sarita mukhesh wedding, sarita case mukhesh, sarita mukhesh case, sarita comments mukhesh, mollywood actresses

actress sarita controversial comments on husband actor mukhesh : actress sarita comments on her husband (actor) mukhesh that he is playing a wrong game with her in divorce case

భర్తను బజారుకీడ్చిన నటి సరిత!

Posted: 08/06/2014 12:55 PM IST
Actress sarita controversial comments on husband actor mukhesh

ఈమధ్య కాలంలో నటీనటుల మధ్య విడాకుల బెడత రానురాను మరీ పెచ్చుమీరిపోతున్నాయి. నిన్నటికి నిన్నే నటి మీరాజాస్మిన్ పెళ్లి విషయానికి సంబంధించిన వివాదం తెరమీదకు వచ్చి పెద్ద దుమారాన్ని రేపతే... తాజాగా అలనాటి నటి అయిన సరిత కూడా తన భర్త మోసం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తోంది. తన భర్త తెరవెనుక వుండి తనకు తెలియకుండా కుట్రలు పన్నుతున్నాడని.. అతనిపై విచారణలు జరపవలసిందిగా ఆమె పోలీసులను ఆశ్రయిస్తోంది.

తొలినాళ్లలో నటి సరిత, మలయాళ నటుడు ముఖేష్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! వారి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు కుమారులు కూడా వున్నారు. అయితే ఇద్దరిమధ్య పరస్పరం మనస్పర్థలు ఏర్పడిన కారణంగా వారిద్దరూ కొంతకాలంపాటు దూరంగానే వుంటూ తమ జీవితాలను గడిపారు. అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ముఖేష్ మరో వివాహం చేసుకోగా.. నటి సరిత తన పిల్లలతో కలిసి ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు. అయితే ఎలాగూ దూరంగా వుంటున్నారు కాబట్టి వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని కేరళలోని ఎర్నాకులం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ఇదిలావుండగా... ముఖేష్ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, నోటీసుల గురించి తనకు తెలియకుండానే తెరవెనుక వుంటూ కుట్రపన్నుతున్నాడని సరిత తన భర్తపై తీవ్ర ఆగ్రహంతో ఆరోపణలు చేశారు. తామిద్దరం విడిపోయినప్పటి నుంచి ముఖేష్ పిల్లల గురించి పట్టించుకోవడం లేదని.. వారిద్దరి ఆలనాపాలనా కూడా తానే చూసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. అలాగే వివాహ రద్దు విషయంలో తన వాదన చెప్పుకోవడానికి తగిన సమయాన్ని కూడా ఆయన కేటాయించడం లేదని ఆమె వాపోయారు. దీంతో ఈ వ్యవహారం మరింత వేడిగా మారిపోయింది. మరి దీనిపై ముఖేష్ స్పందన ఏంటో ఇంతవరకు తెలియలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles