Amir khan pk movie first look release

amir is totally nude in pk moive, amir covering his private parts with tape recorder, amir khan latest news, amir khan pk movie first look, amir khan latest photos, amir khan pk movie first look news, amir khan pk movie, pk movie first look, amir khan news, amir khan pk movie photo gallery

Amir khan pk movie first look release : amir is totally nude and covering his private parts with tape recorder in pk movie

అబ్బే... ఇదేం అవతారం నాయనా?

Posted: 08/01/2014 10:14 AM IST
Amir khan pk movie first look release

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ తాను తీయబోయే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క విధంగా ప్రత్యేకతను కనబరుస్తాడని ప్రతిఒక్కరికీ తెలిసిన విషయమే! నిన్నమొన్నటివరకు యాక్షన్ సినిమాలకు దూరంగా వుండి పిల్లలు, టీనేజ్ ల కోసం మెసేజ్ మూవీలను అందించిన ఈ ఐదున్నర అడుగుల హీరో... బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టే విధంగా ‘‘ధూమ్-3’’ సినిమాలో నటించి ఇండియన్ చిత్రపరిశ్రమలోనే సరికొత్త రికార్డులను సృష్టించేశాడు.

అయితే ఆ సినిమా అనంతరం ఈయన ఒక సంవత్సరం వరకు మళ్లీ తెరముందుగానీ, తెరవెనుక గాసిప్ లతో గానీ అస్సలు కనిపించకుండా పోయాడు. కానీ.. ఇప్పుడు మళ్లీ తిరిగి కనిపించాడు గానీ.. అందరికీ దిమ్మతిరిగి షాక్ కు గురయ్యేలా కనిపించాడు. ఆమీర్ ఖాన్ నటిస్తునన తాజా చిత్రానికి సంబంధించి ఆయన తన ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. అందులో అతను పూర్తి నగ్నంగా కనిపిస్తూ.. తన ప్రైవేట్ పార్ట్స్ ను కప్పి వుంచుతూ ఒక టేప్-రికార్డర్ ను రెండు చేతులతో పట్టుకున్నాడు. ఈ పోస్టర్ ను కనువిందు చేసిన నెటిజన్లందరూ ఆమీర్ ఖాన్ సరికొత్త అవతారంలో దుమ్ముదులిపేస్తున్నాడంటూ కొందరు మద్దతుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే... మరికొందరు మరీ వెటకారంగా వుందంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. ఇదిలావుండగా.. ఆమీర్ ఖాన్ సినీకెరీర్ లోనే ఇదో పెద్ద షాకింగ్ అవతారమని కొంతమంది సినీ ప్రముఖులు సెటైర్లు వేస్తున్నారు.

ఇంతేకాదు బాబోయ్... ఈ సినిమాకు సంబంధించి గతంలో ఆమీర్ ఖాన్ అమ్మాయి అవతారంలో కూడా కనిపించాడు. ఇంకా రకరకాల పాత్రలను ఇందులో ఆయన పోషించనున్నాడని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. హిందూ దేవతల మీద సెటైర్లు వేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఈయన ఒక చేతిలో బ్లేజర్ పట్టుకుని, స్కర్ట్ వేసుకుని వున్న అవతారం కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది.

ఆమీర్ ఖాన్ కూడా తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ ఫోటోను రిలీజ్ చేస్తూ.. ట్విటర్ లో తన అభిమానులను అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిందిగా కోరాడు. ‘‘నా తాజా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ఇదే గాయ్స్..? ఇందులో ఎలా వున్నానో త్వరగా చెప్పండి... నా కడుపులో సీతాకోకచిలుకలు తిరుగుతున్నాయి’’ అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్టర్ ను గనుక బాగా గమనిస్తే.. అందులో ఆమీర్ ఖాన్ తన ఎక్స్ ప్రెషన్ ద్వారా ఎలా వున్నానో చెప్పాల్సిందిగా కనువిందు చేస్తున్నట్టు కనిపిస్తాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles