Deepika padukone high remuneration for bikini photoshoot

deepika padukone demands high remuneration for bikini photoshoot, deepika padukone latest news, deepika padukone bikini photo shoot, deepika padukone hot photo shoot for private company, deepika padukone in happy new year movie, deepika padukone in finding fanny movie, deepika padukone latest movie news, deepika padukone bikini photos, deepika padukone biography

deepika padukone demands high remuneration for bikini photo shoot to a private company

లక్షలకే అంగప్రదర్శన చేసిన భామ!

Posted: 07/30/2014 03:41 PM IST
Deepika padukone high remuneration for bikini photoshoot

‘‘ప్లీజ్ మాకు సినిమాల్లో నటించే ఒక్క అవకాశం ఇవ్వండి.. మా సత్తా ఏంటో నిరూపించుకుంటాం’’ అని దర్శకనిర్మాతల వెనుక వెంటపడి, బరితెగించి ఎక్స్ పోజింగ్లు చేసే మోడల్స్ కోకొల్లలు! చిత్రపరిశ్రమలో స్టార్ డమ్ సంపాదించడానికి ఏ పనిచేయడానికైనా సిద్ధంగా వుంటారు. అయితే అదే స్టార్ డమ్ లభించినప్పుడు మాత్రం... దర్శకనిర్మాతలను తమ వెంట తిప్పుకుంటారు. ఈ కోవలోకి ప్రస్తుతం ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ... అటు బాలీవుడ్ లోనూ చాలామంది స్టార్ హీరోయిన్లే వున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ముందు పేరొచ్చేది మాత్రం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె!

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ముందు మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మడు... షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అయితే అది కొన్నాళ్లవరకే పరిమితం కావడం వల్ల ఆ తరువాత తన శరీరంలో నటించిన సినిమాల్లో దాదాపు తన శరీరంలో వున్న అంగాలను ప్రదర్శిస్తూ బికినీలు వేసుకుంటూ వచ్చింది. అప్పుడప్పుడు కుర్రాళ్లను మత్తెక్కించేలా హాట్ ఫోటోషూట్ లు ఇచ్చింది. కొన్నాళ్లక్రితం సరిగ్గా ఆఫర్లు కూడా రాని ఈ అమ్మడు ఒకేసారి వరుసగా విజయాలు సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానాన్ని సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మడు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ.. దర్శకనిర్మాతల్ని తన వెంటే తిప్పించుకుంటోంది.

ఇదిలావుండగా.. తాజాగా ఈ ఆరడుగుల హాట్ భామ ఇంతవరకు ఏ హీరోయిన్ తీసుకోనంతగా ఓ ఫోటోషూట్ కోసం దాదాపు 57 లక్షలవరకు రెమ్యునరేషన్ తీసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడిపోయింది. ఓ కార్పొరేట్ సంస్థ తమ కంపెనీని పబ్లిసిటీ చేసుకోవడం కోసం దీపికకు భారీ డబ్బులు ముట్టజెప్పి ఫోటోషూట్ చేయించుకుంది. సాధారణంగా ఒక మూవీకోసం 2 నుంచి 5 కోట్ల దాకా డబ్బులు డిమాండ్ చేసే ఈ అమ్మడు.. కేవలం 40 సెకన్లపాటు మాత్రమే వుండే ఈ ఫోటోషూట్ కోసం దాదాపు 57 లక్షలవరకు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ ఫోటోషూట్ లో దీపికా ఎటువంటి కలర్ డ్రెస్సులు ధరించుకోకుండా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో వుండే బికినీలో దర్శనమీయబోతోందని సదరు కంపెనీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఈ అమ్మడు భారీగా ఎక్స్ పోజింగ్ చేసిందని, కుర్రకారు మతిపోగొట్టడం ఖాయమని వారు చెబుతున్నారు. ఏదేమైనా దీపికా పదుకొనె మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నేసే విధంగా హాట్ ఫోటోషూట్స్ ఇస్తూనే.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసి, తన బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుంటూనే వుంది. ప్రస్తుతం ఈ అమ్మడు షారుఖ్ సరసన ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ సినిమాతోపాటు ‘‘ఫైండింగ్ ఫన్నీ’’, మరో రెండు పెండింగ్ ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles